నిజమైన విరాట్‌ నాకు మాత్రమే తెలుసు: అనుష్క

7 Oct, 2021 15:06 IST|Sakshi

ఇండియన్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ సంతోషకరమైన వివాహ జీవితానికి గుర్తుగా ఓ కూతురు జన్మించిన విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు సోషల్‌ మీడియాలో సైతం ఒకరిపై ప్రేమను మరోకరు వ్యక్త పరుస్తూనే ఉంటారు. తాజాగా భర్త విరాట్‌ గురించి అనుష్క ఓ ఇంట్రస్టింగ్‌ వీడియోని షేర్‌ చేసింది.

‘ప్రజలకు గ్రౌండ్‌లో కనిపించే విరాట్‌నే చూస్తుంటారు. కానీ నేను ఆయనలో రోజుకో కొత్త వ్యక్తిని చూస్తుంటా.  నిజమైన వ్యక్తి నాకు తెలుసు. ఆయన దగ్గర ప్రత్యేకంగా నాకోసమే ఓ కొత్త కథ ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి, ప్యాషన్‌ని కరెక్ట్‌ బ్యాలెన్స్‌ చేస్తాడు. సరదాగా, కేరింగ్‌గా ఉంటాడు’ అంటూ ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది అనుష్క. దీంతో ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే కొని సంవత్సరాల డేటింగ్‌ అనంతరం నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది విరాట్‌, అనుష్క జంట. అభిమానులు వీరిద్దరినీ కలిపి ‘విరుష్క’ అని పిలుచుకుంటుంటారు. వారికి కూతురు పుట్టగా ఆమెకు ‘వామిక’ అని పేరు పెట్టుకున్నారు. ఆమె పిక్‌లను సైతం అనుష్క కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులలో ఫ్యాన్స్‌తో పంచుకుంది.

చదవండి: అవమానంతో రణ్‌వీర్‌ ఆమెతో మాట్లాడ్డం మానేశాడు

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

మరిన్ని వార్తలు