విరుష్కా: నెంబర్‌ 11 వెనుకున్న రహస్యం!

2 Feb, 2021 13:54 IST|Sakshi

ముంబై :  విరుష్క దంపతులకు నెంబర్‌11తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎలా అంటే.. విరాట్‌ కోహ్లీ పుట్టిన నెల, పెళ్లి రోజు, తండ్రైన రోజు, కెరీర్‌లో సాధించిన ఘనతలన్నింటీ 11తో సంబంధం ఉండటం ఇప్పడు చర్చనీయాంశమైంది. విరాట్‌ పుట్టినరోజు 11వ నెలలోనే వస్తుంది. అనుష్కతో పెళ్లి ​కూడా డిసెంబర్‌11న జరిగింది. ఇక విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మ దంపతులకు జనవరి 11న పండంటి పాప జన్మనిచ్చింది. అప్పటి నుంచి కూతురుకి సంబంధించిన ఏ విషయాన్ని అభిమానులతో విరుష్క జోడీ పంచుకోలేదు. అంతేకాకుండా.. ప్రైవసీ పేరు చెప్పిన విరాట్ కోహ్లీ.. కుటుంబ సభ్యుల్ని మినహా ఎవరినీ ఆసుపత్రిలో పాపని చూసేందుకు అనుమతించలేదు.  (తొలిసారి కూతురి ఫొటో షేర్‌ చేసిన ‘విరుష్క’)

తాజాగా తమ గారాలపట్టిని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అనుష్క  ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా తమ ముద్దుల కుమార్తె పేరును వెల్లడించారు.  విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ పేర్లు కలిసేలా 'వామికా' అని నామకరణం చేశారు. ఇంతకీ ఈ పేరు ఎలా పెట్టారో తెలుసా..ఆంగ్ల అక్షరం వి అంటే విరాట్‌, ఎ అంటే అనుష్కలను కలగలిపితే వా..దానికి 'మిక'ను జతచేయడం ద్వారా అమ్మవారి పేరువచ్చింది. వామిక అంటే కనకదుర్గ అని అర్థం. చిన్నారి వామికను అనుష్క పరిచయం చేసిన కొన్ని నిమిషాలకే ఆమె ఇన్‌స్టాగగ్రామ్‌ మొత్తం అభినందనలు, శుభాకాంక్షలతో నిండిపోయింది.

పలువురు ప్రముఖులు చిన్నారిని ఆశీర్వదిస్తూ పోస్టులు పెట్టారు. ఇక న్యూమరాలజీ ప్రకారం అనుష్క అదృష్ట సంఖ్య 3కాగా, విరాట్‌కు 7గా ఉంది. చిన్నారి వామికా లక్కీ నెంబర్‌ 3గా ఉంది. అయితే 11 అనే నెంబర్‌తో కోహ్లీ, అనుష్కకు ఏదో అనుంబంధం ఉందని, ఆ సంఖ్య వారికి కలిసొస్తుందని వారి సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అయితే దాని వెనుకున్న రహస్యం మాత్రం ఎవరికీ తెలీదు.  (కోహ్లి వీరాభిమాని కూతురు పేరు తెలుసా?)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు