Anushka Shetty: ‘నేను యోగ టీజర్‌గా చేశానని అందరికి తెలుసు.. కానీ, అది ఎవరికి తెలియదు’

9 Nov, 2022 09:26 IST|Sakshi

అందానికి, అభినయానికి చిరునామా నటి అనుష్క అని చెప్పవచ్చు. టాలీవుడ్‌లో సూపర్‌ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈమె నట పయనం సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌లా సాగిపోయింది. అందులో ఎన్నో విజయాలు, అగ్రనటిగా అందలం ఎక్కిన తరుణాలు.. కొన్ని తప్పటడుగులు వెరసి అనుష్క 17 వసంతా ల సినీ జీవితం. టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో క్రేజీ కథానాయకిగా రాణించిన అనుష్క చివరిగా నటించిన చిత్రం సైలెన్స్‌. ఆ చిత్రం నిరాశపరిచింది. ఇకపోతే ఇడుప్పళగి చిత్రం కోసం భారీగా బరువును పెంచుకున్న అనుష్కకు అది కేరీర్‌ పరంగా బాగా ఎఫెక్ట్‌ అయింది. 

చదవండి: ‘ఈ యంగ్‌ హీరోల తీరు వల్లే సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నాయి’

కారణాలు ఏమైనా ఈ బొమ్మాళి వెండితెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. మళ్లీ ఎప్పుడు తెరపై మెరుస్తుందా? అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి తీపి కబురు అనుష్క తాజాగా ఒక  తెలుగు చిత్రంలో నటిస్తోంది. యువ నటుడు నవీన్‌ పోలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో అనుష్క లేడీ చెఫ్‌గా నటించడం విశేషం. ఈ పాత్రను సోమవారం మీడియాకు రిలీజ్‌ చేశారు. కాగా 17 ఏళ్ల పయనాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నటి అనుష్క ఒక భేటీలో పేర్కొంటూ ఇన్నేళ్లు హీరోయిన్‌గా రాణించడం సంతోషంగా ఉందని చెప్పింది.

పలువురు దీన్ని చిరకాల పయనం అని అంటున్నారని, అయితే తనవరకు ఇది చాలా చిన్నపయనమని పేర్కొంది. బాగా శ్రమిస్తే కథానాయికలు సినిమా రంగంలో ఎక్కువకాలం నిలదొక్కుకోవడం సాధ్యమేనంది. ఆ నమ్మకంతోనే తాను ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చానంది. చాలామంది మాదిరిగానే తాను ఈ రంగంలోకి అనుహ్యంగా ప్రవేశించానని చెప్పింది. అంతకుముందు తనకు సినిమా గురించి ఏమి తెలియదని చెప్పింది. మొట్టమొదటిసారిగా కెమెరా ముందు నిల్చున్నప్పుడు భయపడ్డానంది.

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే

తనకు ఫలానా హీరోతో నటించాలని ఫలానా పాత్రలో నటించాలని లెక్కలేసుకోవడం తన పాలసీ కాదని చెప్పింది. మంచి కథ ఉన్న పాత్రలు చేయాలని మాత్రమే ఆశించానంది. తాను చాలా చిత్రాల్లో నటించినా, అరుంధతి చిత్రమే నెంబర్‌ వన్‌ అని పేర్కొంది. ఏనాటికైనా అలాంటి కథా పాత్రల్లో నటించడం చాలెంజ్‌ అని చెప్పింది. తాను ఈ రంగానికి రాకముందు యోగా టీచర్‌గా పనిచేసిన విషయం చాలా మందికి తెలుసని, అయితే అంతకుముందు పాఠశాలలో మూడో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పానన్న విషయం అతి కొద్దిమందికే తెలుసని  పేర్కొంది. 
    

మరిన్ని వార్తలు