కీల‌కం కానున్న 'అనుష్క' సాక్ష్యం

21 Sep, 2020 14:58 IST|Sakshi

అనుష్క, మాధవన్‌ జంటగా న‌టించిన ‘నిశ్శబ్దం’ చిత్రం అక్టోబ‌రు 2న విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్ర ట్రైల‌ర్‌ను హీరోలు రానా ద‌గ్గుబాటి, విజ‌య్ సేతుప‌తి ట్విట్ట‌ర్ ద్వారా విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అమెజాన్  ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రంలో అనుష్క సాక్షి అనే దివ్యాంగురాలి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అనుష్క బెస్ట్ ప్రెండ్ పాత్ర‌లో షాలిని పాండే న‌టించారు. ఓ హత్య‌కేసులో నిందితురాలిగా షాలినిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. మూగ‌, చెవిటి అమ్మాయిగా ఉన్న అనుష్క సాక్ష్యం ఈ కేసులో  కీల‌కంగా మార‌నుంది. (నిశ్శబ్దం కూడా...)

 ఇక మాధవన్‌, అనుష్క ఓ దెయ్యముండే ఇంట్లోకి వెళతారు. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే సన్సెన్స్ కొన‌సాగేలా ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. సినిమాలో హాలీవుడ్‌ నటుడు అండ్రూ హడ్సన్‌, హీరోయిన్ అంజలి క్రైమ్ ఆఫీస‌ర్లుగా క‌నిపించారు.  ఏప్రిల్‌ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’ థియేటర్స్‌లో సంద‌డిచేసేది. కానీ  లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా విడుద‌ల‌కు  బ్రేక్ ప‌డింది.  థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయ‌న్న దానిపై క్లారిటీ లేక‌పోవ‌డంతో నిశ్శబ్దం సినిమాను ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు. అక్టోబ‌ర్‌2న  భారతదేశంతో పాటు 200 దేశాల్లో మా సినిమా విడుదల కానుంది. (ఓటీటీలో మొదటి బ్లాక్‌బస్టర్‌ మా ‘నిశ్శబ్దం’)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా