Viral Photo: ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా?

19 Jul, 2021 16:14 IST|Sakshi

Actress Childhood Photo: అందచందాలతో, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న తారలు చిన్నప్పుడు ఎలా ఉన్నారో చూడాలని అభిమానులు తహతహలాడుతుంటారు. సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడూ ఫ్యాన్స్‌ కోసం ఆల్బమ్‌లో నుంచి కొన్ని చిన్ననాటి ఫొటోలను సోషల్‌ మీడియాలో వదులుతుంటారు. దీంతో లైకులు, షేర్లతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట తెగ వైరలవుతుంటాయి. తాజాగా ఓ స్టార్‌ హీరోయిన్‌ చైల్డ్‌హుడ్‌ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ గింగిరాలు తిరుగుతోంది. ఇంతకీ తల్లి ఒడిలో కూర్చుని కెమెరా వైపు ఓ లుక్కిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఆమె ఇప్పుడు తెలుగులోనే కాదు సౌత్‌ ఇండస్ట్రీలోనే స్టార్‌ హీరోయిన్‌.

టాలీవుడ్‌లో దాదాపు అగ్ర హీరోలందరితో నటించిన ఆమె లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో జనాలకు మరింత దగ్గరైంది. ఇటీవలే నిశ్శబ్దం చిత్రంతో ఓటీటీ ప్రేక్షకులను పలకరించిందీ హీరోయిన్‌. ఆమెవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. అవును, మీరనుకుంటున్నట్లు ఆమె మన జేజమ్మ అనుష్క శెట్టి. తన తల్లిదండ్రులు, అన్మదమ్ములతో కలిసి ఇలా ఫొటోకు పోజిచ్చిందీ స్వీటీ. ఇదిలా వుంటే అనుష్క ప్రస్తుతం తెలుగులో యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తుందంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుంది, కానీ అఫీషియల్‌ అప్‌డేట్‌ మాత్రం రాలేదు.

మరిన్ని వార్తలు