త్వరలోనే స్వీటీ పెళ్లి, తనకంటే చిన్నవాడైన వ్యాపారవేత్తతో..!

28 Apr, 2021 18:58 IST|Sakshi

టాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లలో మోస్ట్‌ బ్యాచిలరేట్‌ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది అనుష్క శెట్టి పేరు. ఆమె పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పరిశ్రమలో డార్లింగ్‌ ప్రభాస్‌- అనుష్కల జోడి క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనేది ఇటూ స్వీటీ, అటూ డార్లింగ్‌ అభిమానుల కోరిక. ఈ క్రమంతో గతంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త నెట్టింట హల్‌చల్‌ చేసింది. అది విని వీరిద్దరి అభిమానులు తెగ సంబరపడిపోయారు.

అయితే దీనిపై ప్రభాస్‌, అనుష్కలు స్పందించి తాము కేవలం స్నేహితులమే అని క్లారిటి ఇచ్చి అందరిని నిరాశపరిచారు. దీంతో స్వీటీ ఎవరిని పెళ్లాడబోతుందా, ఆ లక్కీఫెలో ఏవరాని తెలుసుకునేందుకు ఆమె అభిమానులు ఉత్సుకతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉండే ఆమె.. ఈ మధ్య కాస్తా మూవీస్‌ తగ్గించింది. దీంతో ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపోతోంది. ఈ క్రమంలో అనుష్కకు త్వరలో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారట. దీనికి స్వీటీ కూడా ఓకే అనడంతో వరుడి వేటలో పడినట్లు సమచారం. 

కొంతకాలంగా మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి చివరకు ఓ అబ్బాయి దొరికినట్లు సమాచారం. ఆ అబ్బాయి దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకుగా తెలుస్తోంది. దీంతో అతడితోనే మన స్వీటి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. అయితే అతడు అనుష్క కంటే వయసులో చిన్నవాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ అంతా కుదిరితే కరోనా పరిస్థితులు సాధారణం స్థితికి వచ్చాక ఇరుకుంటుంబాలు చర్చించుకుని పెళ్లికి ముహుర్తం పెట్టుకొవాలనుకుంటున్నట్లుగా వినికిడి. కాగా ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే అనుష్క స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

చదవండి: 
‘బిల్లా’లో నా బికినీపై అమ్మ చేసిన వ్యాఖ్యలకు షాకయ్యా..
పోకిరి మూవీకి 15 ఏళ్లు.. నమ్రత కామెంట్‌..
వైరల్‌ అవుతోన్న జూ. ఎన్టీఆర్‌ అరుదైన వీడియో..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు