అనుష్క కొత్త సినిమా.. సరికొత్త లుక్‌లో స్వీటీ

22 Jan, 2021 11:06 IST|Sakshi

‘నిశ్శబ్దం’ తర్వాత కొత్త చిత్రమేదీ ప్రకటించలేదు అనుష్క. ఏ సినిమా చేయబోతున్నారనేది కూడా ఎలాంటి స్పష్టత లేదు. అయితే స్వీటీ ఓ సినిమాకు కమిట్‌ అయ్యారనేది తాజా సమాచారం. సందీప్‌ కిషన్‌ హీరోగా ‘రారా కృష్ణయ్య’ చిత్రానికి దర్శకత్వం వహించిన పి. మహేశ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి అనుష్క గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. సరికొత్త పాయింట్‌తో ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం. (చదవండి: హైదరాబాద్‌లో అనుష్క.. ఫొటోలు వైరల్‌)

అందుకే అనుష్క ఈ సినిమా కమిట్‌ అయ్యారట. ఇందులో ఆమె సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని టాక్‌. అందుకోసం మేకోవర్‌ కూడా అవుతారట. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. (చదవండి: అనుష్క–విజయ్‌– ఓ సినిమా?)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు