శరత్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి: సీఎం జగన్

22 May, 2023 17:07 IST|Sakshi

సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చలనచిత్ర రంగంలో గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమన్నారు.  కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు పొందారని గుర్తు చేసుకున్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సీఎం ట్వీట్ చేశారు.

(ఇది చదవండి: శరత్‌బాబు-రమాప్రభ లవ్‌స్టోరీ వెనుక ఇంత కథ నడిచిందా?)

దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించిన శరత్ బాబు అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1973లో రామరాజ్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శరత్ బాబు.. చివరిసారిగా మళ్లీ పెళ్లి అనే చిత్రంలో కనిపించారు. శరత్ బాబు మృతి పట్ల ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంచ్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి, టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

(ఇది చదవండి: ఆయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటు: పోసాని కృష్ణమురళి)


 

మరిన్ని వార్తలు