ఏపీ ఫిలిం ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ అత్యవసర సమావేశం

29 Jul, 2021 14:20 IST|Sakshi

సాక్షి, అమరావతి : కరోనా ఎఫెక్ట్‌ సినీ పరిశ్రమపై గట్టిగానే పడింది. ఫస్ట్‌వేవ్‌ నుంచి కోలుకుంటున్న సమయంలోనే కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చి పడటంతో భారీ నష్టం వాటిల్లింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతుండటంతో థియేటర్లు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఈనెల 31 నుంచి థియేటర్లు తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు, లైసెన్సింగ్ విధానం, థియేటర్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏపీ ఫిలిం ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యల పరిష్కారం కోరాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా తెలుగు ఫిలించాంబర్‌ మాజీ అధ్యక్షుడు ఎస్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘చాలా మంది థియేటర్లలో సినిమాలు ప్రదర్శించలేని పరిస్థితి ఉంది. సినీ రాజధాని విజయవాడకు పూర్వ వైభవం తీసుకురావాలి. సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిగణలోకి తీసుకొని స్పందిస్తారని ఆశిస్తున్నాం’అని అన్నారు. ఈ సమావేశంలో 13 జిల్లాల థియేటర్ల యజమానులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు