ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం

15 Aug, 2021 00:03 IST|Sakshi
చిరంజీవి

కరోనా సెకండ్‌ వేవ్‌ పరిస్థితులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన, ఇతర సమస్యలపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి సినీ ప్రముఖులకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని హీరో చిరంజీవికి ఫోన్‌ చేశారు. సినీ రంగంలో నెలకొన్న ప్రస్తుత సమస్యల గురించి సినీ పెద్దలతో కలిసి వచ్చి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి వివరించాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నెలాఖరులో ఈ సమావేశం జరగనుంది. థియేటర్స్‌లో వందశాతం సీటింగ్, టిక్కెట్‌ ధరలు, ఎగ్జిబిటర్స్‌ సమస్యలు, సినీ రంగంపై ఉపాధి పొందుతున్న వారి సమస్యలు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చలు జరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు