ఆ రోజు ఏం జరిగింది

5 Jan, 2021 06:37 IST|Sakshi

రంజిత్, షెర్లీ అగర్వాల్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఏప్రిల్‌ 28 ఏం జరిగింది’. ఈ చిత్రం ద్వారా వీరాస్వామి దర్శక–నిర్మాతగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను నారా రోహిత్‌ విడుదల చేయగా, పరుచూరి గోపాలకృష్ణ, శ్రీవిష్ణు వీడియో ద్వారా టీమ్‌కి శుభాకాంక్షలు చెప్పారు. ‘‘తెలుగు సినీ రచయితల సంఘంలో మొట్టమొదటి వ్యక్తి ఏల్చూరి వెంకట్రావు. ఆయన కుమారుడు రంజిత్‌ వాళ్ల నాన్నలానే ఆయుర్వేద డాక్టర్‌ అవుతాడనుకున్నాను. కానీ యాక్టర్‌ అయ్యాడు.

ఈ సినిమా ట్రైలర్‌ చూశాను. రంజిత్‌ అద్భుతంగా నటించాడనిపించింది’’ అన్నారు పరుచూరి గోపాలకష్ణ. ‘‘రంజిత్‌ నాకు పదేళ్లుగా తెలుసు. థ్రిల్లర్‌ జానర్‌తో తీసిన ఈ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది’’ అన్నారు వీరాస్వామి. రంజిత్‌ మాట్లాడుతూ– ‘‘వీరాస్వామి చెప్పిన లైన్‌ నచ్చటంతో స్క్రిప్ట్‌ డెవలప్‌ చేసి 25 రోజుల్లో షూటింగ్‌ దాదాపుగా పూర్తి చేశాం. కరోనా వల్ల షూట్‌ ఆగిపోవటంతో పాటు మా వీరాస్వామిగారి మదర్, మా సినిమాకి పని చేసిన కిశోర్‌గారు రీసెంట్‌గా కరోనాతో చనిపోయారు. ఇలాంటి ఎన్ని ఘటనలు జరిగినా ధ్వజస్తంభంలా నిలిచి సినిమాను పూర్తి చేసిన వీరాస్వామిగారికి హ్యాట్సాఫ్‌’’ అన్నారు.

మరిన్ని వార్తలు