‘సుశాంత్‌ సింగ్‌కు పట్టిన గతే తనకు పట్టిస్తారు’

5 Jun, 2021 14:51 IST|Sakshi

కార్తీక్‌ ఆర్యన్‌కు మద్దతుగా అనుభవ్‌ సిన్హా, అపూర్వ అస్రానీ

బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ని దోస్తానా 2 సినిమా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. కరణ్‌ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ సగం పూర్తయ్యింది. అయినప్పటికి కార్తీక్‌ను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో కావాలనే కార్తీక్‌ను సినిమా నుంచి తొలగించారని.. అతడికి వ్యతిరేకంగా ఇండస్ట్రీలో ప్రచారం చేస్తున్నారని పలువురు ప్రముఖులు బహిరంగంగానే ప్రకటించడమే కాక కార్తీక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ  క్రమంలో దర్శకుడు అనుభవ్‌ సిన్హా, రైటర్‌ అపూర్వ అస్రానీ కార్తీక్‌ ఆర్యన్‌కు మద్దతుగా ట్వీట్‌ చేశారు. 

‘‘నిర్మాతలు నటులను తప్పించినప్పుడు వారు దాని గురించి మాట్లాడరు. ఎప్పుడు ఇదే జరుగుతుంది. కార్తీక్‌ ఆర్యన్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందని నాకు తెలిసింది. ఇది చాలా అన్యాయం. నేను తన మౌనాన్ని గౌరవిస్తున్నాను’’ అంటూ అనుభవ్‌ సిన్హా ట్వీట్‌ చేశారు.

అపూర్వ అస్రానీ దీన్ని రీట్వీట్‌ చేస్తూ.. ‘‘అనుభవ్‌ సిన్హాను నేను గౌరవిస్తున్నాను. కార్తీక్‌కు వ్యతిరేకంగా చాలా స్పష్టమైన ప్రచారం జరుగుతుందని తెలిపారు. సరిగ్గా ఏడాది క్రితం సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ విషయంలో కూడా ఇదే జరిగింది. అతడు ఎదుర్కొంటున్న బెదిరింపులు గురించి నేను బ్లాగ్‌ చేశాను. దాంతో చాలా మంది జర్నలిస్ట్‌లు నన్ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు. మంచి కోసం ఏదైనా మారుతుందని నేను భావిస్తున్నాను’’ అంటూ అపూర్వ అస్రానీ. 

కార్తీక్‌ ఆర్యన్‌ తొలగింపుపై ధర్మ ప్రొడక్షన్‌ స్పందించింది. కార్తీక్‌ పద్దతేమీ బాగోలేదని, అతడి ప్రవర్తన అనైతికంగా ఉండటంతోనే తనను తొలగించామని తెలిపింది. కొల్లిన్‌ డీ కున్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న దోస్తానా 2ని తిరిగి డైరెక్ట్‌ చేయనున్నాం. త్వరలోనే దీని గురించి అధికారకి ప్రకటన చేస్తాం అని తెలిపింది. 

చదవండి: సగం షూటింగ్‌ అయ్యాక యంగ్‌ హీరోను సైడ్‌ చేశారు

మరిన్ని వార్తలు