నటుడిగా ఎంట్రీపై స్పందించిన ఏఆర్‌ రెహమాన్‌

14 Aug, 2021 19:31 IST|Sakshi

ప్రముఖ సంగీత దర్శకుడు తాజాగా సినిమాల ఎంట్రీపై స్పందించారు. మూడు దశాబ్ధాలుగా పరిశ్రమలో టాప్‌ మ్యుజిక్‌ డైరెక్టర్‌గా ఆయన రాణిస్తున్నారు. అయితే మిగతా సినీ సంగీత దర్శకులు అప్పుడప్పుడు అతిథి పాత్రల్లో తెరపై కనిపిస్తున్నప్పటికీ రెహమాన్‌ మాత్రం ఇప్పటికీ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. దీంతో ఎంతోమంది అభిమానులు ఆయన వెండితెర ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో రెహమాన్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ అభిమాని ‘నటుడిగా మీ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది సార్‌’ అని ప్రశ్నించాడు. దీనికి రెహమాన్‌ ‘గతంలో మాదిరిగా భవిష్యత్తులో నేను ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా!’ అని సరదాగా సమాధానం ఇచ్చారు. ఇక ఈ సమాధానంతో సినిమాల్లో​ నటించాలనే ఆసక్తి ప్రస్తుతం తనకు లేదని ఆయన చెప్పకనే చెప్పారు. దీంతో ఫ్యాన్స్‌ అంత ఆయన కామెంట్‌తో నిరాశ చెందుతున్నారు. గ‌త 30 ఏళ్లుగా సినీ ప‌రిశ్ర‌మ‌లో అద్భుత‌మైన సంగీతంతో అలరిస్తున్న రెహ‌మాన్.. త‌మిళంలో ‘వెందు తనిద‌తు కాడు, పోన్నియ‌న్ సెల్వ‌న్, కోబ్రా,ఐలాన్’ వంటి చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు