మణిరత్నం ప్రోత్సాహంతోనే చేశా: ఏఆర్‌ రెహమాన్‌

5 Apr, 2021 10:35 IST|Sakshi

చెన్నై: దర్శకుడు మణిరత్నం ప్రోత్సాహంతోనే చిత్ర నిర్మాణం చేపట్టినట్టు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ పేర్కొన్నారు. వీరు తొలిసారిగా కథ, కథనం, సంగీతం అందించి సొంతంగా నిర్మించిన చిత్రం 99 సాంగ్స్‌. ఈ చిత్రం ద్వారా ఇమాన్‌ భట్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. నటి ఎడిస్లీ వర్గస్‌ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి విశ్వేష్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. మ్యూజికల్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన 99 సాంగ్స్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకు ని ఈ నెల 16వ తేదీన తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కథకుడు సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ చిత్ర నిర్మాణం అనేది పాటలను రూపొందించడం లాంటిదేనని.. మణిరత్నం సార్‌ తనతో ఒకసారి అన్నారన్నారు. ఉదాహరణకు పాటలకు బాణీలు సమకూర్చడం, నేపథ్య సంగీతాన్ని అందించడం చేస్తున్నారని, ఇలా అందమైన పాటలు పయనం చేసినట్లే చిత్ర నిర్మాణం కూడా అని మణిరత్నం సార్‌ చెప్పడంతో కొత్త కళ చేపట్టిన్నట్లు తెలిపారు. ఇది ఎంత ఆత్మ సంతృప్తిని కలిగిస్తుందో తనకు ఇప్పుడు అర్థమైంది అన్నారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్‌ సంస్థ విడుదల చేస్తోంది. 

చదవండియాంకర్‌పై ఏఆర్‌ రెహమాన్‌ ట్రోలింగ్‌

మరిన్ని వార్తలు