Archana Chandhoke Divorce: కలిసుండటం కష్టం.. విడాకులకు సిద్ధమయ్యా..

10 Mar, 2023 19:38 IST|Sakshi

ప్రముఖ యాంకర్‌, తమిళ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ కంటెస్టెంట్‌, నటి అర్చన చందోక్‌ భర్తకు విడాకులిచ్చేందుకు సిద్ధమైంది. ఇరవై ఏళ్లుగా కలిసి జీవిస్తున్న భర్త వినీత్‌తో విడిపోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం విడాకులు పత్రాలను కూడా సిద్ధం చేసుకుంది. కానీ ఆఖరి నిమిషంలో తన మనసు మార్చుకుంది. ఈ విషయాన్ని తాజా షోలో వెల్లడిస్తూ బోరుమని ఏడ్చింది యాంకర్‌.

'మీ అందరికీ ఓ నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఒక నెల రోజుల క్రితం నేను, నా భర్త విడిపోదామని ఓ నిర్ణయానికి వచ్చాం. పదే పదే భేదాభిప్రాయాలు వస్తుండటం, గొడవలవుతుండటంతో కలిసి ఉండటం జరగని పని అని విడాకులు తీసుకుందామని నిశ్చయించుకున్నాం. అందుకు సంబంధించిన విడాకుల పత్రాలను కూడా మేము రెడీ చేసుకున్నాం. కానీ మా కూతురు మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడింది. మమ్మల్ని తిరిగి కలిపింది. పదిహేను రోజుల క్రితం వినీత్‌ వైజాగ్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడని మెసేజ్‌ వచ్చింది. అప్పుడు నన్నెవరో చెంప మీద లాగిపెట్టి కొట్టినట్లు అనిపించింది.

బిగ్‌బాస్‌ తర్వాత నామీద నెగెటివిటీ పెరిగింది. బాత్రూమ్‌ టూర్‌ వీడియో చేశాక నన్ను మరింత విమర్శించారు. ఇంతలో నా భర్త నాకు దూరమవుతున్నాడు. ఇవన్నీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ సమయంలో జారా మాకు జ్ఞానోదయం చేసింది. మేమిద్దరం ఒకరిని విడిచిపెట్టి ఒకరం ఉండలేమని చెప్పింది. అప్పటిదాకా గొడవలతో కోపాన్ని పెంచుకున్న మా కళ్లల్లో ఒక్కసారిగా ప్రేమవర్షం కురిసింది. ఇప్పుడు నేను నా భర్తను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా అర్చన ఇటీవలే శివకార్తికేయన్‌ హీరోగా నటించిన డాక్టర్‌ సినిమాలో నటించింది. ఇందులో యాంకర్‌ కూతురు జారా కూడా తళుక్కుమని మెరిసింది. కాగా అర్చన వినీత్‌ను 2004లో పెళ్లాడింది. వీరికి జారా అనే కుమార్తె జన్మించింది.

మరిన్ని వార్తలు