The Archies First Look: బాలీవుడ్‌ బిగ్‌ స్టార్స్‌ వారసులంతా ఒకే ఫ్రేమ్‌లో..

15 May, 2022 08:03 IST|Sakshi

బాలీవుడ్‌ బిగ్‌ ఫ్యామిలీస్‌ వారసులు అగస్త్యా నంద (అమితాబ్‌ బచ్చన్‌ మనవడు), ఖుషీ కపూర్‌ (బోనీ కపూర్‌ – దివంగత నటి శ్రీదేవిల చిన్న కుమార్తె), సుహానా ఖాన్‌ (షారుక్‌ ఖాన్‌ కుమార్తె) నటిస్తున్న తొలి వెబ్‌ ఫిల్మ్‌ ‘ద ఆర్చీస్‌’ పోస్టర్‌ విడుదలైంది.

జోయా అక్తర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌ మూవీలో మిహిర్‌ అహుజా, డాట్, యువరాజ్‌ మెండా కూడా నటిస్తున్నారు. శనివారం ‘ద ఆర్చీస్‌’ గ్యాంగ్‌ ఇదే అని ప్రకటించి, ఫొటోని రిలీజ్‌  చేశారు. 2023లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్‌ ఫిల్మ్‌ స్ట్రీమింగ్‌ కానుంది. 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

మరిన్ని వార్తలు