సహజీవనం : బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్‌ చెప్పేసిన నటి

11 Feb, 2021 19:01 IST|Sakshi

మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి సుస్మిత సేన్‌ బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్  షాల్‌తో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా లివింగ్‌ రిలేషన్‌షిప్‌‌ను కొనసాగిస్తున్న ఈ జంట అనూహ్యంగా బ్రేకప్‌ చెప్పుకున్నట్లు బీ-టౌన్‌లో టాక్‌ వినిపిస్తుంది. ఇందుకు సుస్మిత పెట్టిన ఓ పోస్ట్‌ ఫ్యాన్స్‌ను కలవరపాటుకు గురిచేస్తుంది.   సమస్య ఏంటంటే..అతడు మారుతాడని మహిళ భావిస్తుంది. కానీ అతడు మారడు. పురుషులు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తుంది.  కానీ అతడిని వదిలి వెళ్లదు అనుకుంటాడు. కానీ ఈ కథలో నీతి ఏంటంటే అతడు ఎప్పటికీ మారడు. ఆమె వెళ్లిపోతుంది' అని సుస్మితా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది. (సుస్మితతో పెళ్లి.. ప్రియుడి కామెంట్‌)

అంతేకాకుండా తన ఇద్దరు కూతుళ్లతో దిగిన ఫోటోను కూడా సుస్మిత షేర్‌ చేస్తూ..ఒకరికొకరం ఎప్పటికీ వెన్నంటే ఉంటామంటూ ఓ క్యాప్షన్‌ను జోడించింది. ఇందులో రోహ్‌మ‌న్ లేకపోవడంతో వీరిద్దరూ బ్రేకప్‌ చెప్పేసుకున్నారని, ఇక కన్మఫర్మేషన్‌ ఒకటే మిగిలిందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. కాగా తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన కశ్మీర్‌ మోడల్‌తో సుస్మిత ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఇదే ఇదే విషయాన్ని ప్రేమకు చిహ్నమైన తాజ్‌ మహాల్‌ దగ్గర దిగిన పిక్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేసి అధికారికంగా ప్రకటించారు కూడా. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తమ బంధాన్ని తెలియజేస్తూ వారు దిగిన ఫోటోలను అభిమానుల కోసం షేర్‌ చేస్తుంటారీ జంట. ఇటీవలె సుస్మిత పేరును ప్రియుడు రోహ్మాన్ పచ్చబొట్టు వేయించుకున్నాడు. (విడాకులపై స్పందించిన సుష్మితా సేన్‌ సోదరుడు)

A post shared by Sushmita Sen (@sushmitasen47)

A post shared by Sushmita Sen (@sushmitasen47)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు