Ariyana Glory: రాజ్‌ కారణంగా రెండు సార్లు చేదు అనుభవం ఎదుర్కొన్నా

29 Nov, 2021 13:27 IST|Sakshi

సీన్లలో డైరెక్టర్‌ గవిరెడ్డి గారిని ఊహించుకునేదాన్ని: అరియాన

రాజ్‌కు యాక్సిడెంట్‌ అయి కాలు, చెయి విరగాలని కోరుకున్నా

Ariyana Glory Shocking Comments On Raj Tarun: యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌పై బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు రాజ్‌ తరుణ్‌ అంటే అసలు నచ్చదంటూ అందరినికి షాక్‌ గురి చేసింది. రాజ్‌ తరుణ్‌ తాజాగా నటించిన అనుభవించు రాజా చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అరియానా ​ఓ పాత్ర పోషించింది. ఈ సందర్భంగా మూవీ టీంతో కలిసి ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న అరియాన సరదాగా హీరో, దర్శకుడిని ఆటపట్టించింది. ఈ క్రమంలో రాజ్‌ తరుణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి అలియా పారితోషికమెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఈ మేరకు అరియాన మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే ఒకప్పుడు రాజ్‌ తరుణ్‌ అంటే నాకు అస్సలు నచ్చదు. కానీ తనతో సినిమాకు ఎలా చేశానో అర్థం కావట్లేదు. టీవీలో ఆయన సినిమాలు వస్తే అవి తీసేయ్‌మని చెప్పేదాన్ని. ఒకరోజు రాజ్‌ కారులో వెళుతుంటే తనకి యాక్సిడెంట్‌ అవ్వాలని కోరుకున్నా’ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఎందుకని అంత అసహ్యమని మిగతా సినిమా క్రూడ్‌ అడగ్గా.. ‘ఇలాగే ఒక ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పుడు చాలా సేపు వేయిట్‌ చేయించాడు. నా ముందే కారులో వెళుతుంటే హీరో ఏంటి వెళ్లిపోతున్నాడని అడగ్గా డబ్బింగ్‌ కరెక్షన్‌ ఉందని వెళుతున్నాడు’ అని చెప్పారు.

చదవండి: శివ శంకర్‌ మాస్టర్‌ చివరి కోరిక ఏంటో తెలుసా?

అంతకు ముందు కూడా ఓ చానల్‌లో చేసేటప్పుడు రాజ్‌ని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. వాళ్ల సినిమా చేస్తే నాకు ప్రమోషన్‌ వస్తుంది. ఇక హీరోతో ఇంటర్వ్యూ అని చాలా ఎక్జయిటింగ్‌గా ఉన్నాను. చూస్తున్నా, చూస్తున్నా ఆయన ఎంతకు రావడం లేదు. మూడు గంటలు వేయిట్‌ చేశాను. చివరకు ఆయన సినిమా హిట్‌ అయ్యిందని, సార్‌ పటా వెళ్లిపోయారని చెప్పారు. ఇలా రెండుసార్లు రాజ్‌ వల్ల నాకు చేదు అనుభవం ఎదురైంది. అందుకే కారులో వెళుతుంటే యాక్సిడెంట్‌ అయ్యి కాలో, చెయ్యో విరగాలి అనుకున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు రాగానే తన ఫస్ట్‌ మూవీ రాజ్‌తో నటించే అవకాశం వచ్చిందని చెప్పింది. ఇక సినిమా సెట్‌కు రాగానే రాజ్‌ ఎదురవ్వడంతో ఈయన ఎందుకు వచ్చాడా? అని అనుకున్నానని పేర్కొంది. 

చదవండి: సెట్‌లో గాయపడ్డ యంగ్‌ హీరో, 25 కుట్లు, 2 నెలలు షూటింగ్‌కు బ్రేక్‌..

ఇక రాజ్‌ తరణ్‌ తన పక్కనే కూర్చుని మాట్లాడుతుంటే  ‘ఇతనేందుకు నాతో మాట్లాడుతున్నాడు’ అని అనుకునేదాన్ని అంంటూ దర్శకుడు గవిరెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్‌తో మాట్టాడటం నచ్చక మధ్య మధ్యలో గవిరెడ్డి గారిని చూస్తూ ఈయనేవరో తెలియదు, సినిమా ఎందుకు ఒప్పుకున్నానో ఏంటో అంటూ మనసులో తిట్టుకున్నట్టు చెప్పింది. అంతేగాక రాజ్‌తో సీన్స్‌ చేస్తున్నప్పుడు దర్శకుడు గవిరెడ్డిని చూస్తు ఈయన నా ముందు ఉంటే బాగుండు, ఈ సీన్‌లో ఆయన ఉంటే  బాగుండు అనుకునేదాన్నంటూ అరియాన కామెంట్స్‌ చేసింది. అంతేగాక ఓ రోజు కావాలనే సెట్‌లో రాజ్‌ తరుణ్‌ను 8 గంటలు వేయిట్‌ చేయించాను అనగానే డైరెక్టర్‌ అరియానను ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఈ ఇంటర్వ్యూలో అనుభవించు రాజా మూవీ హీరోయిన్‌, దర్శకుడు గవిరెడ్డి, బిగ్‌బాస్‌ ఫేం రవి కృష్ణ కూడా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు