మొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పా: అర్జున్‌ దాస్‌

19 Jan, 2023 10:08 IST|Sakshi

‘‘బుట్టబొమ్మ’ తమిళ్‌ రీమేక్‌ అయినా తెలుగుకి తగ్గట్టు మార్పులు చేశారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుందని నాగవంశీగారు నమ్మారు’’ అని నటుడు అర్జున్‌ దాస్‌ అన్నారు. అనికా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రల్లో శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుట్టబొమ్మ’. ఎస్‌.నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలకానుంది.

అర్జున్‌ దాస్‌ మాట్లాడుతూ– ‘‘ఖైదీ, అంధకారం, మాస్టర్‌’ సినిమాల వల్లే నాకు ఇంత మంచి గుర్తింపు వచ్చింది. అందరూ నా వాయిస్‌ గురించి మాట్లాడుతుంటారు. అలాగే నా నటనను కూడా ఇష్టపడుతున్నారని ఆశిస్తున్నాము. బుట్టబొమ్మ కోసం మొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నాను. నేను ఈ సినిమా ఒప్పుకునే ముందే నిర్మాత వంశీ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పాలని షరతు పెట్టారు.మా నిర్మాతలు సినిమాకు కావాల్సినవన్నీ సమకూర్చారు. దర్శకుడు రమేష్ మీద నమ్మకం ఉంచి, ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు’ అన్నారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు