లవ్‌ బర్డ్స్‌కి కరోనా

7 Sep, 2020 01:52 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌కు, నటి మలైకా అరోరాకు కరోనా సోకింది. తనకు కరోనా వచ్చిందనే విషయాన్ని అర్జున్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ‘‘నాకు కరోనా సోకిందనే విషయం అందరికీ తెలియజేయడం నా బాధ్యత. నేను బాగానే ఉన్నాను. నాకు ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. వైద్యుల సూచన మేరకు మా ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను.

🙏😷

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

నా ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను. మనందరం ఈ వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొని, క్షేమంగా బయటపడతాం అని నమ్ముతున్నాను’’ అన్నారు అర్జున్‌ కపూర్‌. అలాగే మలైకా అరోరాకు కరోనా వచ్చినట్లు ఆమె సోదరి అమృతా అరోరా తెలియజేశారు. అర్జున్, మలైకా కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే ప్లాన్‌లో కూడా ఉన్నారని బాలీవుడ్‌ టాక్‌.

🙏🏽

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు