ప్రేయసి ఇంటి సమీపంలో నటుడి కొత్త విల్లా, ఖరీదు ఎంతంటే?

30 May, 2021 13:58 IST|Sakshi

'నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల..' అని హిందీలో పాటలు పాడుకుంటున్నాడట బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌. ఇంతకీ అతడు ఎవరి గురించి పాడుకుంటున్నారో మీకీపాటికే అర్థమై ఉంటుంది. అవును, తన ప్రేయసి మలైకా అరోరా గురించే! ఆమెతో ఎడబాటును అస్సలు భరించలేకపోతున్నాడట అర్జున్‌. ఆమెను చూడకుండా ఉండటం తన వల్ల కావడం లేదని, ఏకంగా ఆమె ఇంటికి సమీపంలోనే ఓ ఖరీదైన విల్లా కొనుగోలు చేశాడట. సెలబ్రిటీల నివాసాలకు నిలయమైన ముంబైలోని బాంద్రాలో అర్జున్‌ ఓ విలాసవంతమైన విల్లాను తన సొంతం చేసుకున్నాడని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.

ఒక హాలు, వంటగది, బాల్కనీతో పాటు నాలుగు బెడ్‌రూమ్‌లు ఉన్న ఈ స్కై విల్లాను 20 నుంచి 23 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ​మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. కాగా మలైకా-అర్జున్‌ రెండేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్భాజ్‌ ఖాన్‌తో విడాకులు తీసుకున్న మలైకా అర్జున్‌ కంటే 12 ఏళ్లు పెద్దదైనప్పటికీ వారి లవ్‌ లైఫ్‌లో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలూ ఎదురై దాఖలాలు లేవు. అంతేకాకుండా మలైకాకు ఒ కొడుకు ఉన్నాడు కాబట్టి వారి వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా స్పందించమని అర్జున్‌ ఈ మధ్యే మీడియాకు తెలిపాడు. భాగస్వామిగా మలైకా గతాన్ని గౌరవిస్తానని చెప్పాడు. కానీ పెళ్లి ప్రస్తావన మాత్రం లేవనెత్తలేదు.

చదవండి: మలైకతో అర్జున్‌ డేటింగ్‌, తన గతాన్ని గౌరవిస్తున్నా

ఆ బాధ చూడలేక కూతుర్ని చంపేయాలనుకున్నా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు