మలైకతో అర్జున్‌ డేటింగ్‌, తన గతాన్ని గౌరవిస్తున్నాను

22 May, 2021 17:36 IST|Sakshi

ప్రస్తుతం బాలీవుడ్ లవ్‌బర్డ్స్‌ అంటే వెంటనే గుర్తొచ్చేది మలైకా అరోరా-అర్జున్‌ కపూర్ల జంట.  అంతగా ఈ జంట బి-టౌన్‌లో చక్కర్లు కొడుతున్నారు. కొంతకాలం సిక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న వీరు ఏడాది క్రితమే వారి రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. అయితే మొదట్లో ఈ జంట పెద్దగా కలిసి తిరిగేవారు కాదు. పైగా వారి రిలేషన్‌ గురించి బయట ఎక్కడా ప్రస్తావించడానికి ఆసక్తిని చూపేవారు కాదు. తాజాగా దీనికి కారణాన్ని వెల్లడించాడు అర్జున్‌. కాగా మలైకా, అర్జున్‌ కంటే 12 ఏళ్లు పెద్దదనే విషయం తెలిసిందే. సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్భాజ్‌ ఖాన్‌తో మలైకా విడాకులు తీసుకుని విడిపోయింది. అనంతరం అర్జున్‌తో ప్రేమ వ్యవహారన్ని కొనసాగిస్తోంది. అయితే మలైకా-అర్భాజ్‌ ఖాన్‌ దంపతులకు ఆర్హాన్‌ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అర్హాన్‌ మలైకాతోనే ఉంటున్నాడు.

ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్‌ తమ ప్రేమ వ్యవహరాన్ని గోప్యంగా ఉంచడానికి కారణం చెప్పాడు. ‘నేను నా వ్యక్తిగత విషయాలను బహిరంగంగా మాట్లాడేందుకు ఇష్టపడను. ఎందుకంటే నా జీవిత భాగస్వామిని గౌరవించాలన్నది నా అభిప్రాయం. అంతేకాదు తనకు ఓ గతం కూడా ఉంది. నేను మా రిలేషన్‌ గురించి మాట్లాడే ముందు తనకు ఓ కుమారుడు కూడా ఉన్నాడనేది దృష్టి పెట్టుకుని వ్యవహరించాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు, పరిస్థితులు పిల్లలను ప్రభావితం చేస్తాయి. అందుకే మా వ్యక్తిగత విషయాలను ఎక్కువగా ప్రస్తావించను’ అంటు చెప్పుకొచ్చాడు. అంతేగాక తను మలైకా గతానికి గౌరవం కూడా ఇస్తానని చెప్పాడు.

‘నేను మా మధ్య ఉన్న కొన్ని సరిహద్దులను గౌరవించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే భాగస్వామిగా తనకు నేను సౌకర్యవంతమైన పరిస్థితులను ఇవ్వాలి. అందుకే మా మధ్య కొన్ని సరిహద్దులను సృష్టించుకున్నాము. ఇక ఈ రోజు నేను దీనిపై మాట్లాడటానికి కారణం లేకపోలేదు. ఇంతకాలం మేము మాకు కావాల్సినంత సమయాన్ని కేటాయించుకున్నాము. ఇప్పుడు తన గురించి నేను, నా గురించి తను పూర్తిగా తెలుసుకుని ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. దీనివల్ల తనపై, తన గతంపై నాకు ఇంకా గౌరవం పెరిగింది’ అంటూ అర్జున్‌ వివరణ ఇచ్చాడు. కాగా అర్జున్‌ నటించిన ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’ మూవీ నెట్‌ఫ్లీక్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో నీనా గుప్తా కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం అర్జున్‌ నటిస్తున్న భూట్‌ పోలీసులో సైఫ్‌ అలీ ఖాన్‌, జాక్వేలిన్‌ ఫెర్నాడేజ్‌, యామి గౌతమ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు