Arjun Kapoor-Boycott: చేతకానితనంగా చూస్తున్నారా.. బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై హీరో రియాక్షన్‌

18 Aug, 2022 09:49 IST|Sakshi

ప్రస్తుతం బాలీవుడ్‌కు బాయ్‌కాట్‌ సెగ అట్టుకుంది. మొదట ఆమిర్‌ ఖాన్‌ లాల్‌ సింగ్‌ చద్ధా మొదలైన బాయ్‌కాట్‌ ట్రెండ్‌ ఇప్పుడు అక్షయ్‌ కుమార్‌ రక్షా బంధన్‌, త్వరలోనే రిలీజ్‌ కాబోయే హృతిక్‌ రోషన్‌ విక్రమ్‌ వేద చిత్రాలకు తాకింది. తాజాగా ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై హీరో అర్జున్‌ కపూర్‌ స్పందించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ బాలీవుడ్‌ మొత్తం ఐక్యంగా ఉండి ఈ సమస్యను ఎదుర్కొవాలని పిలుపు నిచ్చాడు.

చదవండి: ఆస్కార్‌ బరిలో నాని సినిమా.. మూడు క్యాటగిరిల్లో పోటీ

ఈ మేరకు అర్జున్‌ పోస్ట్‌ చేస్తూ.. ‘ఇంతకాలం బాయ్‌కాట్‌పై మౌనం ఉండి తప్పుచేశాం. అది మా మర్యాద అనుకున్నాం. ఇన్నాళ్లు మా పనితనమే దీనికి సమాధానం ఇస్తుందని అనుకుని పొరపాటు చేశాం. కానీ కొందరు దీనితో ప్రయోజం పొందడం స్టార్ట్‌ చేశారు. బురదలో చేయి పెట్టడం ఎందుకని మేం అనుకుంటుంటే. మా సహనాన్ని చేతకానితనంగా చూస్తున్నారు. బాయ్‌కాట్‌ను ఓ ట్రెండ్‌గా మారుస్తున్నారు. మన గురించి రాసే రాతలు, ట్రెండ్ చేసే హ్యాష్‌ట్యాగ్‌లు వాస్తవికతకు చాలా దూరంగా ఉన్నాయి.

చదవండి: వారీసు మూవీ టీంకు షాక్‌.. నిర్మాత దిల్‌ రాజు స్ట్రిక్ట్‌ వార్నింగ్‌!

దీన్ని ఎదుర్కొనేందుకు మనమంతా ఏకం కావాలి’ అని అర్జున్ కపూర్ పిలుపునిచ్చాడు. అలాగే సినిమాలను బహిష్కరించాలనే సంస్కృతి సరైనది కాదంటూ అసహనం వ్యక్తం చేశాడు. ‘ప్రతి శుక్రవారం ఉదయం ప్రజల్లో ఉత్తేజం ఉండేది. కొత్త చిత్రం కోసం వాళ్లు ఉత్సాహం చూపిస్తుంటే పరిశ్రమ ప్రకాశవంతంగా వెలిగిపోయేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోవడం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు కొందరు మనపై బురద జల్లుతున్నారు. కానీ, సినిమా విడుదల తర్వాత ప్రజల అభిప్రాయం మారుతుందని భావిస్తున్నాం’ అంటూ అర్జున్ కపూర్ రాసుకొచ్చాడు.

మరిన్ని వార్తలు