Arjun Kapoor: అర్జున్‌ కపూర్‌కి కరోనా.. ఇల్లుకు సీల్‌ వేసిన బీఎంసీ

29 Dec, 2021 18:39 IST|Sakshi

బాలీవుడ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇటీవల బీటౌన్‌కు చెందిన ప్రముఖుల కరోనా బారిన పడిన తెలిసిందే. తాజాగా హీరో అర్జున్‌ కపూర్‌కు బుధవారం (డిసెంబర్‌ 29) కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. అర్జున్‌ కపూర్‌తోపాటు అతని సోదరి అన్షులా కపూర్‌కు మహ్మమారి సోకింది. కరీనా కపూర్‌ ఖాన్‌ కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత వీరిద్దర కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తమను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు. అర్జున్ కపూర్‌ ప్రేయసీ మలైక అరోరా కొవిడ్‌ పరీక్షలు చేసుకోగా ఆమెకు నెగెటివ్‌ వచ్చింది. ఇటీవల వారిద్దరూ ఓ డిన్నర్‌ డేట్‌కు వెళ్లినట్లు సమాచారం. 

అలాగే రియా కపూర్‌, తన భర్త కరణ్‌ బూలానీకి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని రియా కపూర్‌ తన ఇన్‌స్టా గ్రామ్‌ స్టోరీ ద్వారా షేర్‌ చేసింది. 'ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ నేను నా భర్త కరోనా బారిన పడ్డాం. ఇది మహమ్మారి స్వభావం. మేమిద్దరం ఐసోలేట్‌ అవుతున్నాం. వైద్యులు సూచించిన మెడిసిన్ తీసుకుంటున్నాం.' అని తెలిపారు. అర్జున్‌ కపూర్‌ ఇంట్లో నలుగురికి కరోనా రావడంతో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) అప్రమత్తమైంది. ముంబైలోని అర్జున్‌ కపూర్‌ నివాసానికి సీల్ వేసింది. ఇంటి పరిసరాలను శానిటైజ్‌ చేస్తుంది బీఎంసీ. ఇదిలా ఉంటే గతేడాది సెప్టెంబర్‌లో అర్జున్‌ కపూర్ తొలిసారిగా కరోనా బారిన పడ్డాడు. 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

మరిన్ని వార్తలు