ఫ్యామిలీకి దగ్గరయ్యేలా...

3 Apr, 2021 00:21 IST|Sakshi
సాయిధరమ్‌ తేజ్, కేతికా శర్మ, వైష్ణవ్‌ తేజ్‌

‘ఉప్పెన’ ఫేమ్‌ వైష్ణవ్‌ తేజ్‌ పంజా హీరోగా మూడో సినిమా షురూ అయింది. ‘అర్జున్‌ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను తెరకెక్కించిన గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. కేతికా శర్మ హీరోయిన్‌ . బాపినీడు సమర్పణలో బీవీయస్‌యన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వైష్ణవ్‌ తేజ్‌ తల్లి విజయ దుర్గ కెమెరా స్విచాన్‌ చేయగా, ఆయన సోదరుడు, హీరో సాయితేజ్‌ క్లాప్‌ ఇచ్చారు. ‘‘ఉప్పెన’తో యూత్‌కు దగ్గరైన వైష్ణవ్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసే కథతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపొందించనున్నాం’’ అన్నారు బీవీయస్‌యన్‌ ప్రసాద్‌.

మరిన్ని వార్తలు