‘స్కామ్‌ 1992’ హీరోను అరెస్ట్‌ చేయాలంటున్న నెటిజన్స్‌!! కారణం ఇదే..

20 Sep, 2021 09:16 IST|Sakshi

#ArrestPratikGandhi.. ప్రస్తుతం సోషల్‌ మీడియాను కుదిపేస్తున్న హ్యాష్‌ ట్యాగ్‌. స్కామ్‌1992తో ఖండాతర గుర్తింపు దక్కించుకున్న గుజరాతీ నటుడు ప్రతీక్‌ గాంధీని అరెస్ట్‌ చేయాలని సోషల్‌ మీడియాలో కొందరు పట్టుబడుతున్నారు.  అందుకు కారణం.. ప్రతీక్‌ కొత్త సినిమా ‘భవాయి’, అందులోని కొన్ని సన్నివేశాలు. 


భవాయి.. ప్రతీక్‌ గాంధీ లీడ్‌ రోల్‌లో నటించిన కొత్త చిత్రం. అక్టోబర్‌ 1న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్‌ కావాల్సి ఉంది. ఈ సినిమాకు ముందుగా ‘రావణ్‌ లీలా’ అనే టైటిల్‌ పెట్టారు.  అది కాస్త వివాదాస్పదం కావడంతో  ‘భవాయి’గా మార్చేశారు. అయినా వివాదం చల్లారట్లేదు.  మొన్నీమధ్యే ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేయగా.. అందులోని సన్నివేశాలపై ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాను నిషేధించాలని డిమాండ్‌ మొదలైంది.

భవాయి అనేది గుజరాతీ జానపద నాటక కళ.  ఈ కళ ఆధారంగా దర్శకుడు హర్ధిక్‌ గజ్జర్‌ ‘భవాయి’ అనే ప్రేమకథ తీశాడు. ఇందులో లీడ్‌ క్యారెక్టర్‌ల మధ్య లవ్‌ సీక్వెన్స్‌ చూపించే క్రమంలో.. మతపరమైన మనోభావాలు దెబ్బతీశారనేది కొందరి ప్రధాన అభ్యంతరం. అందుకే ప్రధాన పాత్ర పోషించిన ప్రతీక్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక కొందరైతే గతంలో మహారాష్ట్రలో నిషేధానికి గురైన ఓ సినిమా ప్రస్తావన తీసుకొస్తూ.. ఇప్పుడూ అదే పని చేయాలంటూ కేంద్రాన్ని కోరుతున్నారు. ఓపక్క దక్షిణాది సినీ పరిశ్రమ మంచి మంచి సినిమాలతో భారత సినీ ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్తుంటే..  బాలీవుడ్‌ మాత్రం కావాలనే మత సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా సినిమాలు తీస్తూ దిగజారి పోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.
 

అయితే ఈ వివాదంపై టైటిల్‌ మార్చే టైంలోనే నటుడు ప్రతీక్‌ స్పందించాడు. రావణ పాత్రను హైలెట్‌ చేసేదిగా ఈ సినిమా ఏం ఉండదని, కేవలం నాటకం ఆధార సన్నివేశాలతో కథపై ఓ అంచనాకి రావడం సరికాదని ప్రతీక్‌ ఆడియొన్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నాడు కూడా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు