అఫ్గనిస్తాన్‌లో తాలిబన్‌ రాజ్యం.. క్రికెటర్‌తో నిశ్చితార్థం రద్దు: నటి

23 Aug, 2021 14:10 IST|Sakshi

ముంబై: తాలిబన్ల వశం అయిన నాటి నుంచి అఫ్గనిస్తాన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా వ్యాణిజ్య వ్యాపార సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే తాలిబన్ల ఆక్రమణ వల్ల తన నిశ్చితార్థం కూడా రద్దయింది అంటున్నారు హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 11, 14 కంటెస్టెంట్‌ అర్షి ఖాన్. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అర్షి ఖాన్‌ తాజాగా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో అఫ్గనిస్తాన్‌ క్రికెటర్‌తో తన నిశ్చితార్థం జరగాల్సి ఉండేనని.. కానీ తాలిబన్లు.. అఫ్గన్‌ను ఆక్రమించడంతో అది కాస్త రద్దయ్యిందని తెలిపారు.

కొన్ని రోజుల క్రితం ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్షి ఖాన్‌ మాట్లాడుతూ.. ‘‘ఓ అఫ్గనిస్తాన్‌ క్రికెటర్‌తో ఈ ఏడాది అక్టోబర్‌లో నా నిశ్చితార్థం జరగాల్సి ఉండే. ఆ అబ్బాయిని మా నాన్న సెలక్ట్‌ చేశారు. సదరు క్రికెటర్‌ మా నాన్న స్నేహితుడి కుమారుడు. కానీ తాలిబన్లు అఫ్గన్‌ను ఆక్రమించడంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాం. అయినప్పటికి కూడా మేం మంచి మిత్రులుగానే ఉన్నాం. ఈ నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు నాకనిపిస్తుంది.. నా జీవిత భాగస్వామి తప్పకుండా భారతీయ వ్యక్తే అయి ఉంటాడు’’ అని తెలిపారు. 
(చదవండి: సెల్ఫీ అన్నాడు.. ఏకంగా ముద్దే పెట్టేశాడు)

ఇక ఈ ఇంటర్వ్యూలో అర్షి ఖాన్‌ తన అఫ్గనిస్తాన్‌ మూలాల గురించి కూడా వెల్లడించారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను అఫ్గనిస్తాన్‌ పఠాన్‌ను. నా కుటుంబం యూసుఫ్ జహీర్ పఠాన్ జాతికి చెందినది. నా తాత అఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చారు.. భోపాల్‌లో జైలర్‌గా ఉన్నారు. నా మూలాలు అఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాయి.. అయినప్పటికి నేను భారతీయ పౌరురాలినే" అన్నారు అర్షి ఖాన్. ఇక ఆమె 4వ ఏట ఉన్నప్పుడు అర్షి ఖాన్‌ తల్లిదండ్రులు అఫ్గన్‌ నుంచి ఇండియాకు వలస వచ్చారు.  
(చదవండి: అఫ్గన్‌ల నరకయాతన.. పాక్‌ వికృతానందం!)

అర్షి ఖాన్‌ బిగ్ బాస్ సీజన్‌ 11 లో పాల్గొన్నారు. ఆ తర్వాత 14వ సీజన్‌లో ఛాలెంజర్‌గా షోలో తిరిగి ప్రవేశించారు. అర్షి 'సావిత్రి దేవి కాలేజ్ అండ్‌ హాస్పిటల్', 'విష్', 'ఇష్క్ మే మార్జవాన్' వంటి టీవీ షోలతో పాటు అనేక ఇతర రియాలిటీ షోలు, మ్యూజిక్ వీడియోలలో కనిపించారు. ఇదేకాక 'రాత్ కి రాణి బేగం జాన్', 'ది ఈవిల్ డిజైర్స్' వంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించారు అర్షి.

చదవండి: మీ మౌనం... మాకు ప్రాణాంతకం!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు