సిద్ధార్థ్‌-షెహనాజ్‌ మధ్యలో వెళ్తున్నానని నిందించారు: నటి

27 Sep, 2021 21:23 IST|Sakshi

దివంగత నటుడు, బిగ్‌బాస్‌ 13 విజేత సిద్ధార్థ్‌ శుక్లాతో చివరి రోజుల్లో కలిసి లేనందుకు నటి ఆర్తి సింగ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. కొంతకాలంగా తను, సిద్ధార్థ్‌తో మాట్లాడుకోవడం లేదని, తనతో చివరిగా 2019లో ఫిబ్రవరిలో మాట్లాడినట్లు ఆమె పేర్కొంది. ఇటీవల ఆర్తీ సింగ్‌ ఓ మీడియాలో చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చివరి క్షణాల్లో సిద్ధార్థ్‌తో మాట్లాడనందుకు చాలా బాధగా ఉందంటూ కన్నీటీ పర్యంతరం అయ్యింది. కాగా ఆర్తి, సిద్ధార్థ్‌తో పాటు బిగ్‌బాస్‌ 13లో కంటెస్టెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సిద్ధార్థ్‌ అతడి రూమార్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ షెకనాజ్‌ గిల్‌ మధ్యలో వెళుతున్నానని నాపై ఆరోపణలు చేశారు. మా స్నేహన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. అంతేకాదు నేను.. సిద్ధార్థ్‌-షెహనాజ్‌ రిలేషన్‌షిప్‌ను డిస్టర్భ్‌ చేస్తున్నానని, వారి మధ్య దూరాన్ని పెంచుతున్నానని నిందించారు. అది నన్ను తీవ్రంగా బాధించింది. ఎందుకంటే నా వల్ల మరోకరు బాధపడటాన్ని తట్టుకోలేను. అందుకే వారి జీవితం వారిదని వదిలేశాను. అంతేగాక సిద్ధార్థ్‌తో కూడా మాట్లాడటం మానేశాను. గత రెండేళ్లుగా సిద్ధార్థ్‌తో అసలు కాంటాక్ట్‌లో నేను. చివరి సిద్ధార్థ్‌తో 2019లో ఫిబ్రవరీలో మాట్లాడాను  కానీ ఇప్పుడు తనతో ఎందుకు మాట్లాడటం మానేశానని ప్రతి రోజు బాధపడుతున్నాను. అతడు ఇలా ఆకస్మాత్తుగా అందరిని విడిచి వెళ్లిపోతాడని ఊహించలేదు’ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యింది. 

కాగా బిగ్‌బాస్‌ 13 సీజన్‌లో సిద్ధార్థ్‌ శుక్లా, షెహనాజ్‌ గిల్‌ జోడి ఎంత ఫేమస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ఇంట్లో వారి మధ్య సాన్నిహిత్యం హౌజ్‌లోని వారితో పాటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అదే రిలేషన్‌ను వారు హౌజ్‌నుంచి బయటకు వచ్చాక కొనసాగించారు. కాగా ఆర్తీ సింగ్‌ ‘మాయక్‌’ అనే టీవీ షోతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత ఆమె ‘గృహస్తీ’, ‘తోడా హై బస్‌ తోడె కి జరూరత్‌ హై’, ‘పరిచయ్.. నయీ జిందగి ఖ్యా సప్నోకా’తో పాటు ఉత్తరన్‌ వంటి టీవీ సీరియల్స్‌లో నటించింది. అలాగే ఆమె బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు గొవిందా బంధువు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు