సోనూసూద్‌: ఓ ఇంట్రస్టింగ్‌ వీడియో 

5 Jun, 2021 16:14 IST|Sakshi

రియల్‌ హీరో సోనూసూద్‌పై ఆర్టిస్ట్‌ ప్రశంసలు

 ఆసక్తికరమైన వీడియో, నెటిజన్లు ఫిదా

సాక్షి,హైదారాబాద్‌: వలస కార్మికులు,పిల్లలు పెద్దలు ఇలా కరోనా బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నవ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే..ఎవరికైనా మదిలో మెదిలో ఒకే ఒక్క పేరు  నిస్సందేహంగా సోనూ సూద్‌. తన విశేష సేవలతో రిలయ్‌ హీరోగా ప్రశంసంలందుకుంటున్న సోనూసూద్‌కు అనేకమంది  అనేక రకాలుగా తమ కృతజ్ఞతలు తెలిపారు. ముంబైలోని ఆయన నివాసానికి వెళ్లి తమ సంతోషాన్ని పంచు కుంటున్నారు. తాజాగా ఒక  ఆర్టిస్టు వీడియో ఒకటి ఆసక్తికరంగా నిలిచింది.  కోవిడ్‌ వారియర్‌గా సోనూసూద్‌ అందిస్తున్న సేవలకు  ట్రిబ్యూట్‌గా  పుచ్చకాయతో సోనూసూద్‌ చిత్రాన్ని అందంగా తీర్చి దిద్దారు ఆర్టిస్ట్‌ పర్వేష్‌.

ఇటీవల ఒక డ్యాన్స్ రియాలిటీ షోకు అతిథిగా హాజరైన సోను ఒక కంటెస్టెంట్‌ ఉదయ్ సింగ్ షేర్‌ చేసిన అంశాలపై కదిలిపోయారు. లాక్‌డౌన్‌ కాలంలో మధ్యప్రదేశ్‌లోనిఇ నీముచ్‌ గ్రామస్తులు పడుతున్న కష్టాలపై ఉదయ్ భావోద్వేగానికి  లోనయ్యారు. దీంతో వెంటనే స్పందించిన సోనూ ఒక నెల, రెండు నెలలు లేదా ఆరు నెలలు ఎన్నాళ్లు లాక్‌డౌన్‌ కొనసాగినా, తిరిగి మామూలు  పరిస్థితులు వచ్చేంతవరకూ గ్రామం మొత్తానికి రేషన్‌ అందించేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సోనూ వాయిస్‌ బ్యాక్‌ గ్రౌండ్‌తో సాగే ఈ విడియో ప్రస్తుతం నెటిజనులను ఆకట్టుకుంటోంది. 

కాగా కరోనా మహమ్మారి, జాతీయ లాక్‌డౌన్‌లో సొంతూళ్లకు పయనమైన  వలస కార్మికుల వెతలతో చలించిపోయిన సోనూ సూద్‌ నేనున్నానటూ రంగంలోకి దిగారు. అది మొదలు ఎడతెరిపి లేకుండా బాధితులకు అండగా నిలుస్తునే ఉన్నారు.  ముఖ్యంగా సెకండ్‌వేవ్‌లో మందులు కొరత, ఆక్సిజన్‌ కొరతతో ఊపిరి ఆడక అల్లాడిపోతున్నవారిని ఆదుకునేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఆక్సిజన్‌ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశారు. సోనూ సూద్‌ ఫౌండేషన్‌ ద్వారా  నిర్మాణాత్మక కార్యక్రమాలతో  వేలాదిమందికి అండగా నిలుస్తూ  నిరంతాయంగా సేవలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి: ఈ బ్యాంకులో ఖాతా ఉందా? రేణూ దేశాయ్ షాకింగ్‌ పోస్ట్‌

మరిన్ని వార్తలు