Arundhathi Movie: అరుంధతిలో బాలనటి.. అలా మారిపోతుందని ఊహించలేదు..!

24 Oct, 2022 18:21 IST|Sakshi

టాలీవుడ్ నటి అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'అరుంధతి'. ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా అనుష్క ఫేమస్ అయిపోయింది. అందరూ జేజమ్మ అంటూ ముద్దుగా పేరు పెట్టారు.  అయితే ఈ సినిమాలో బాలనటిగా ఓ చిన్నారి అద్భుతంగా నటించింది. తన డైలాగులతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఎవరా చిన్నారి అనుకుంటున్నారా? బాలనటిగా మెప్పించిన దివ్య నగేశ్ అందరినీ తనదైన నటనతో మెప్పించింది. అయితే ప్రస్తుతం ఆ చిన్నారి ఇప్పుడెలా ఉంది? తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చదివేయండి. 

(చదవండి: కాంతార మూవీ.. అమ్మ పాత్రలో నటించిన ఆమె ఎవరో తెలుసా?)

చలనచిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి అగ్రతారలుగా ఎదిగిన వాళ్లు చాలామంది ఉన్నారు. మరికొందరు ఒకటి, రెండు సినిమాలతోనే మర్చిపోలేని గుర్తింపును పొందారు. అలానే అరుంధతి సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్ర పోషించిన చిన్నారి దివ్య నగేశ్ కూడా సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రస్తుతం మలయాళంలో ఆమె పలు సినిమాలు కూడా చేసింది.  టాలీవుడ్‌లో 'నేను నాన్న అబద్దం' అనే సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది దివ్య నగేశ్. ఇటీవలే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.  ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.  తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది అరుంధతి బాలనటి దివ్య నగేశ్.

మరిన్ని వార్తలు