కోలివుడ్‌ను కుదిపేస్తున్న కరోనా: దర్శకుడి భార్య మృతి

18 May, 2021 08:08 IST|Sakshi

యువ నటుడిని బలితీసుకున్న మహమ్మారి

చికిత్స పొందుతూ దర్శకుడి సతీమణి మృతి

కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని కోలివుడ్‌ విలవిలలాడుతోంది. సోమవారం ఓ దర్శకుడు భార్యను, మరో యువ నటుడిని కరోనా కాటేసింది. దర్శకుడు అరుణ్‌రాజ్‌ కామరాజ్‌కు భార్య హింధూజ, యువ నటుడు నితీష్‌ వీరా కరోనాతో కన్నుమూశారు. దర్శకుడు అరుణ్‌రాజ్‌ కామరాజ్‌ సతీమణి హిందూజాకు ఇటీవల కరోనా సోకడంతో చెన్నైలోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించి కన్నుమూశారు. నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్, శివకార్తికేయన్, హిందూజా భౌతిక కాయానికి నివాళులు అర్పించి సంతాపం ప్రకటించారు.  

యువ నటుడిని బలితీసుకున్న కోవిడ్‌ 
మరో యువ నటుడు నితీష్‌ వీరాను కరోనా మహమ్మారి బలి తీసుకుంది. పుదుకోట్టై, వెన్నెల కబడ్డీ కుళు, కాలా అసురన్‌ చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి నితీష్‌ వీరా గుర్తింపు పొందారు. ప్రస్తుతం విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటించిన లాభం చిత్రంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. కరోనా వ్యాధి సోకడంతో నితీష్‌ వీరా స్థానిక ఓమందూర్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. సోమవారం 6.30 గంటల పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

చదవండి: ఆగని మృత్యుఘోష: ఇద్దరు కమెడియన్లు మృతి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు