'అథర్వ' నుంచి అరవింద్ కృష్ణ బర్త్ డే స్పెషల్ పోస్టర్

5 Jan, 2023 13:26 IST|Sakshi

యంగ్ అండ్ టాలెంటెడ్‌ కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరాలు హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్‌ మూవీ అథర్వ.మహేష్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చితత్రాన్ని సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ ప్రముఖ పాత్రను పోషించారు. నేడు (జనవరి 5) ఆయన బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో అరవింద్ కృష్ణ ఎంతో సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ పోస్టర్‌లోనే పోలీసులు, మీడియా అంటూ చాలా హడావిడి వాతావరణం కనిపిస్తోంది. కాగా క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు లవ్, రొమాంటిక్‌, కామెడీ ఇలా అన్ని జానర్లను టచ్‌ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కార్తిక్‌ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుల్హన్, విజయ్ రామరాజు, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు