తలైవర్‌ని గుర్తు చేసుకుంటూ..

25 Dec, 2020 00:06 IST|Sakshi
యంజీఆర్‌గా అరవింద్‌ స్వామి

ప్రముఖ నటుడు, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి యంజీ రామచంద్రన్‌ (యంజీఆర్‌) వర్ధంతి గురువారం. ఈ సందర్భంగా ‘తలైవి’ సినిమా నుంచి అరవింద్‌ స్వామి చేసిన యంజీఆర్‌ పాత్ర లుక్‌ను విడుదల చేశారు. జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో యంజీఆర్‌గా చేయడం గురించి అరవింద్‌ స్వామి మాట్లాడుతూ – ‘‘పురట్చి తలైవర్‌ (విప్లవ నాయకుడు) యంజీఆర్‌ పాత్రను చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవంలా భావిస్తున్నాను. అలానే పెద్ద బాధ్యతలా భావించాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. తలైవర్‌ను గుర్తు చేసుకుంటూ ఈ ఫొటోలను షేర్‌ చేస్తున్నాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు