హీరోలు ఆర్య, గౌతమ్‌ కార్తీక్‌ల మల్టీస్టారర్‌.. పోస్టర్‌ రిలీజ్‌

4 May, 2023 10:50 IST|Sakshi

నటుడు ఆర్య, గౌతమ్‌ కార్తీక్‌ హీరోలుగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇది. దీనికి మిస్టర్‌ ఎక్స్‌ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతకు ముందు విష్ణు విశాల్‌ హీరోగా ఎఫ్‌ఐఆర్‌ అనే సక్సెస్‌పుల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన మణు ఆనంద్‌ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం మిస్టర్‌ ఎక్స్‌. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఏస్‌.లక్ష్మణన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. చదవండి: గొప్పమనసు చాటుకున్న నిర్మాత.. లైట్‌మెన్‌ కుటుంబానికి ఆర్థికసాయం 

చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ ఇది యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. దీనికి దీపు నినన్‌ థామస్‌ సంగీతాన్ని, తన్వీర్‌ మిర్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను ఉగాండా, సెర్పియా రాష్ట్రా ల్లో చిత్రీకించనున్నట్లు చెప్పారు.

ఇందు లో కథ, కథనాలతో పాటు యాక్షన్‌ సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయన్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటు ల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు తెలిపారు. చదవండి: దక్షిణాదిలో స్టార్ క్రేజ్.. అక్కడేమో ఒక్క హిట్‌ కోసం తంటాలు! 

మరిన్ని వార్తలు