ఓటీటీలోకి ఆర్య సర్పట్టా, ఆకట్టుకుంటున్న ట్రైలర్‌

13 Jul, 2021 21:47 IST|Sakshi

తమిళ హీరో ఆర్య తాజా చిత్రం సర్పట్టా. స్పోర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్రిటిష్‌ పాలనలోని ఇండియా కాలం నాటి సినిమాగా రూపొందింది. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌, టీజర్లు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్‌ చేశాయి. ఇక ఆర్య లుక్‌కు అయితే విశేష స్పందన వచ్చింది. ఈ మూవీ వచ్చే వారం ఓటీటీలో విడుదల కానున్న సందర్భంగా ఈ రోజు ట్రైలర్‌ను విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్‌.. బాక్సింగ్‌లో గెలిచిన వాళ్లే తమ నాయకుడు అని ఊరి ప్రజలు మాట్లాడుకోవడంతో ప్రారంభం అవుతుంది.

మొదట్లో ఊరంతా ఒకే వర్గంగా ఉండి బ్రిటిష్ వారితో బాక్సింగ్‌లో పోటీ చేసి గెలిచిన నాయకుడిని ఎన్నుకునేవాళ్ళు. ఆ తర్వాత మన భారతీయులు వాళ్లలోనే వర్గాలుగా ఏర్పడి మనవాళ్లతోనే కొట్లాడి నాయకుడిని ఎన్నుకోవడం మొదలవుతుంది. అలాంటి సమయంలో ఆ ఊరిలో వెనకబడిన జాతిగా పిలువబడి, అసలు పోటీకే అర్హత లేని వర్గం నుంచి ఆర్య పోటీలో ఎలా నిలబడి గెలిచాడన్నదే ఈ సినిమా కథగా ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్య ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? జాతి వివక్ష ఎలా ఉంటుందనేది సినిమాలో చూడాల్సిందే. కాగా పా రంజిత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కే9(K9) స్టూడియోస్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై షణ్ముగం దక్షన్‌ రాజ్ నిర్మించారు. జులై 22న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు