Aryan Khan Drug's Case: డ్రగ్స్‌ కేసులో సమన్లు.. ఎవరీ అనన్య పాండే..?

21 Oct, 2021 17:54 IST|Sakshi

బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసుల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెండేళ్ల క్రితం సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య టైమ్‌లో ఈ  డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. అప్పటినుండి ఎన్‌సీబీఐ చూపు మొత్తం బాలీవుడ్ సెలబ్రిటీల పైనే ఉంది. తాజాగా క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసుకు సంబంధించి బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టై జైల్లో ఖైదీగా ఉన్న విషయం తెలిసింది.
(చదవండి: షారుక్‌ నాకు తండ్రిలాంటి వాడు.. వైరల్‌ అవుతున్న పాత ఇంటర్వ్యూ)

ఈ కేసుకు సంబంధించి తాజాగా బాలీవుడ్‌  హీరోయిన్ అనన్య పాండే ఇంటిలో ఎన్‌సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.అక్కడ ఆమె ఫోన్‌ను స్వాదీనం చేసుకున్న అధికారులు మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని తెలిపారు. అంతేకాదు ఆమె ఫోన్‌, ల్యాబ్‌టాప్‌నీ సీజ్‌ చేశారు కూడా. . రేవ్ పార్టీ జరుగుతన్న సమయంలో ఆర్యన్ ఖాన్.. డ్రగ్స్ కోసం ఒక నటికి వాట్సప్ మెసేజ్ పంపినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ సమయంలో ఆర్యన్ చాట్ చేసింది అనన్య పాండేతోనే అని తేలింది. అలా అనన్య కూడా ఈ డ్రగ్స్ కేసులో చిక్కుకుంది. 

ఎవరీ అనన్య పాండే?
ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న అనన్య పాండే..  బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చుంకీ పాండే తనయ అనే విషయం తెలిసిందే. 2019లో `స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌ 2` చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఆ తర్వాత ‘పతి పత్ని ఔర్‌ వాహ్‌’తో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ భామ ఒక హిందీ మూవీతో పాటు.. తెలుగులో 'లైగర్' లో నటిస్తోంది. హీరోయిన్‌గా ఇప్పటివరకు పెద్ద హిట్‌ కొట్టకపోయినా.. పార్టీ, పబ్బుల్లో మాత్రం ఈ భామ జోరు ఓ రేంజ్‌లో ఉంటుంది.  షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, సైఫ్  కుమార్తె సారా అలీ ఖాన్,  అమితాబ్‌ మనవరాలు నవ్య నవేలి నందా, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌.. అనన్యకు మంచి స్నేహితులు. వీళ్లంతా కలిసే  పబ్‌లకి వెళ్తుంటారు. అర్యన్‌ ఖాన్‌తో సహా మరికొంతమంది కూడా ఈ గ్యాంగ్‌తో కలిసి పార్టీలకు వెళ్తుంటారు. డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ పోలీసులకు పట్టుబడడంతో వీరి బాగోతం అంతా బయటపడుతోంది.

మరిన్ని వార్తలు