నాలుగేళ్లుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నా: విచారణలో ఆర్యన్‌ వెల్లడి

4 Oct, 2021 14:10 IST|Sakshi

Shahrukh Khan Son Drugs Case: ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్‌ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ దాడి చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్‌ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్‌తోపాటు మొత్తం 8మందిని ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు.

అయితే కస్టడీలో ఆర్యన్‌ ఖాన్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆర్యన్‌ నాలుగేళ్లుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు ఎన్‌సీబీకి తెలిపాడు. అతను యూకే, దుబాయ్‌, ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్‌ తీసుకున్నట్లు చెప్పాడు. అయితే అంతకుముందు షారుక్‌ ఖాన్‌ కస్టడీలో ఉన్న తన కుమారుడితో రెండు నిమిషాల పాటు మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాడు. కాగా ఆర్యన్‌ ఎన్‌సీబీ కస్టడీ నేటితో ముగియనుంది. విచారణ సమయంలో అతను కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నట్లు సమాచారం.

చదవండి: ఆర్యన్‌ ఖాన్‌తో లీకైన ఫోటో.. క్లారీటీ ఇచ్చిన ఎన్‌సీబీ

మరిన్ని వార్తలు