Aryan Khan Drugs Case : విట్‌నెస్‌, డిటెక్టివ్‌ కిరణ్‌ గోసవిని అరెస్ట్‌..

28 Oct, 2021 08:59 IST|Sakshi

Kiran Gosavi, NCB Witness In Aryan Khan Case, Arrest: ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విట్‌నెస్‌, డిటెక్టివ్‌  కిరణ్‌ గోసవిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన్ని పూణె పోలీసులు విచారిస్తున్నారు. ఆర్యన్‌ అరెస్ట్‌ తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కారణ్‌ గోసవి ఇటీవలె ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్‌ 2న క్రూయిజ్‌ నౌకపై దాడి జరిగిన కిరణ్‌ గోసవి సహా ఆయన వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్‌ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్‌సీబీ గోసవిని, ప్రభాకర్‌ని సాక్షులుగా చేర్చి విచారించింది. చదవండి: ఆర్యన్‌కు బెయిల్‌ రాకపోతే జరిగేది ఇదే..

ఆర్యన్‌ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు కిరణ్‌ తీసుకున్న సెల్ఫీ సోషల్‌ మీడియాతో తెగ వైరల్‌ అయ్యింది. అయితే తర్వాత గోసవి కనిపించకుండాపోవడం, అతనిపై పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేయడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

కాగా ఇటీవలె మీడియాతో మాట్లాడుతూ ప్రభాకర్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్‌ఖాన్‌ను విడిచిపెట్టడానికి నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులతో రూ.25 కోట్లకు డీల్‌ కుదిరిందని ప్రభాకర్‌ సాయిల్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభాకర్‌ తాను సమర్పించిన అఫిడవిట్‌లో ఆరోపించారు.

చదవండి: Aryan Khan: ఆర్యన్‌ను వదిలేయడానికి రూ.25 కోట్లు?
వాంఖెడే X నవాబ్‌ మాలిక్‌

మరిన్ని వార్తలు