ముగ్గురు వారసులు.. ఓ సినిమా

20 Aug, 2021 05:13 IST|Sakshi

హిందీ చిత్రపరిశ్రమలో స్టార్‌ కిడ్స్‌ ఎంట్రీ కొత్తేం కాదు. ఇప్పటికే చాలామంది స్టార్ల వారసత్వం హిందీ తెరపై కనిపించింది. కానీ ఇప్పుడు ఒకేసారి ముగ్గురు స్టార్‌ కిడ్స్‌ ఒకే సినిమాతో ఎంట్రీ ఇవ్వనుండటం బీ టౌన్‌లో చర్చనీయాంశమైంది. ‘జిందగీ నా మిలేగీ దొబార’, ‘గల్లీభాయ్‌’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకురాలు జోయా అక్తర్‌ ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఓ వెబ్‌ఫిల్మ్‌ చేయనున్నారు. ఒక అంతర్జాతీయ బుక్‌ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాలో బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్యా నంద, దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, బీటౌన్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ నటించనున్నారట. ఇందుకు తగ్గ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని బీటౌన్‌ టాక్‌. మరి.. ఈ  వె»Œ æఫిల్మ్‌తో ఈ ముగ్గురు స్టార్‌ కిడ్స్‌ ఎంట్రీ ఇస్తారా? వేచి చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు