అక్టోబర్‌ 1న ‘అసలేం జరిగిందంటే..?’

24 Sep, 2021 14:42 IST|Sakshi

పెదరాయుడు, ఆహా, పెళ్లి చేసుకుందాం, దేవి  తదితర సూపర్ హిట్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అసలేం జరిగిందంటే..’. శ్రీనివాస్ బండారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీపల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్ హీరోయిన్లుగా నటించారు. జి.ఎస్.ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ చిత్రాన్ని ఏ.బి.ఆర్.ప్రొడక్షన్స్ ద్వారా అనిల్ బొద్దిరెడ్డి సమర్పిస్తున్నారు.

ఒక ట్రయాంగిల్ లవ్ స్టొరీతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 1న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. కుటుంబం అందరూ కలిసి చూసి ఆనందించేలా తమ సినిమా ఉంటుందని దర్శకుడు శ్రీనివాస్ బండారి తెలియజేశారు.   కుమనన్ సేతురామన్, హరితేజ, షఫీ, షాని సాల్మన్, జబర్దస్త్ ఫణి  దొరబాబు తదితురులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, కూర్పు: జె.ప్రతాప్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సాల్మన్, సమర్పణ: అనిల్ బొద్దిరెడ్డి.

మరిన్ని వార్తలు