ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్‌ చేయనున్న కోలీవుడ్‌ హీరో

25 Sep, 2022 15:57 IST|Sakshi

ముగ్గురు ముద్దుగుమ్మలతో అశోక్‌ సెల్వన్‌ రొమాన్స్‌ చేస్తున్న చిత్రం 'నిత్తం ఒరు వానం'. ఈస్ట్‌ సంస్థ అధినేత శ్రీనిధి సాగర్‌ వైకాం 18 స్టూడియోస్‌ సంస్థతో కలిసి నిర్మించిన చిత్రం ఇది. ఆర్‌.కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటుడు అశోక్‌ సెల్వన్, నటి నీతువర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుత తమిళ సినిమాలో ట్రావెలింగ్‌ కథా చిత్రాలు రావడం అరుదని, అలాంటి వైవిధ్య భరిత కథా చిత్రంగా నిత్తం ఒరు వానం ఉంటుందన్నారు. ఇది మనో భావాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు.

ముఖ్యంగా మూడు ప్రాంతాలకు చెందిన మూడు వైవిధ్యమైన భావాలను చిత్రంలో పొందుపరినట్లు చెప్పారు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండటం వల్ల ప్రేమ కథా చిత్రంగా అనిపించినా, అంతకుమించి జీవితానికి సంబంధింన సంతోషకరమైన విషయాలు చాలా ఉంటాయన్నారు. ఇందులో నటుడు అశోక్‌ సెల్వన్‌ చాలా చక్కగా నటించారని అదే విధంగా ముగ్గురు హీరోయిన్లకు సమానంగా పాత్రలు ఉంటాయని చెప్పారు.

నటి రీతూవర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్‌ మొదలగు ముగ్గురు తమ పాత్రలకు న్యాయం చేశారని పేర్కొన్నారు. వీరి పాత్రలు మగువలకు బాగా నచ్చుతాయని చెప్పారు. చిత్రంలో చాలా పాజిటివ విషయాలను చేర్చినట్లు తెలిపారు. చిత్రం షూటింగ్‌ చెన్నై, చండీఘర్, మనాలి, గోపిÔశెట్టి పాళయం, కోల్‌కత్తా ప్రాంతాలలో నిర్వహించినట్లు తెలిపారు. దీనికి గోపీ సుందర్‌ సంగీతాన్ని, అయ్యనార్‌ చాయాగ్రహణం అందించారు. 

మరిన్ని వార్తలు