ఆర్జీవీతో అశు బోల్డ్‌ ఇంటర్వ్యూ చూసిన ఆమె తల్లి రియాక్షన్‌ చూశారా!

8 Sep, 2021 15:42 IST|Sakshi

Ashu Reddy Mother Reaction On Bold Interview With RGV: వివాదాలకు కేరాఫ్‌గా ఉండే రామ్‌గోపాల్‌ వర్మ ఏది చేసినా సెన్సేషనే. అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసే లేడీ యాంకర్లు కూడా యూట్యూబ్‌లో సెన్సేషనల్‌గా మారుతుంటారు. ఈ క్రమంలో ఆయనతో  బిగ్‌బాస్‌ బ్యూటీలు చేసిన బోల్డ్‌ ఇంటర్వ్యూల రచ్చ అంతా ఇంత కాదు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఆర్జీవిని అరియాన గ్లోరీ చేసిన ఇంటర్వ్యూ ఎంతగా వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా అరియాన, ఆర్జీవీ బోల్డ్‌ ఇంటర్వ్యూ చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య అరియాన బాటలో మరో బిగ్‌బాస్‌ భామ అశు రెడ్డి కూడా వర్మతో బోల్డ్‌ ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో అశు ఎంత బోల్డ్‌గా మాట్లాడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

చదవండి: బిగ్‌బాస్‌: 'ఇంత ప్రెజర్‌ తట్టుకోలేను..బయటికెళ్లి వీడియోలు చేసుకుంటా'

సాధారణంగా వర్మ అంటేనే బోల్డ్ నెస్‍కు మారుపేరు. నిర్మొహమాటంగా మనసులో ఉన్న మాటను బయటకు చెప్పేస్తాడు. ఆయనకు ఏ మాత్రం తగ్గకుండా  అశు సైతం బోల్డ్‌గా మాట్లాడింది. అయితే ఆ ఇంటర్వ్యూ చూస్తే ఆమె తల్లి రియాక్షన్‌ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే కాస్తా ఇబ్బందిగా ఉంది కదా. కానీ అందరి ఊహాలను తల కిందులు చేస్తూ ఆమె తల్లి అనుహ్య రీతిలో స్పందించింది. లైవ్‌ చిట్‌చాట్‌లో మాట్లాడుతున్న అశు దగ్గరికి వచ్చిన ఆమె తల్లి ‘ఇంటర్వ్యూ చూశాను. చాలా బాగుంది. బోల్డ్‌గా, స్ట్రాంగ్‌గా చేశావు.  సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చేలా ఉంది’ అంటూ కూతురు చెంపలను తడుముతూ ప్రశంసించింది’ దీనిని అశు ‘ఇది మా అమ్మ నా దగ్గరకు వచ్చి చెప్పిన స్వీట్‌ కాంప్లిమెంట్‌’ అంటూ వీడియో షేర్‌ చేసింది.

చదవండి: RC15: సూటుబూటు వేసుకొని స్టయిలిష్‌గా పోస్టర్‌

ఇక ఈ వీడియోను అర్జీవీ కూడా తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ..  ‘మన అణచివేత, కపట సమాజానికి కావాల్సిన తల్లిదండ్రుల్లో అశురెడ్డి తల్లి ఓ చక్కని ఉదాహరణగా ఉన్నారు. తనలాగే ఆధునిక ఆలోచనలకు అనుగుణంగా తల్లిదండ్రులు అర్థం చేసుకుని పిల్లలను ముందుకు తీసుకెళ్లాలి’ అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా ఈ ఇంటర్వ్యూలో అశు కాఫీ షాపులో కూర్చుని ఫోన్‌లో బిజీగా ఉండగా వర్మ ఆమె దగ్గరకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంటాడు. అయితే ఆర్జీవీ ఎవరో తెలీదన్నట్లు ఆమె నటించింది. ఇంతలో నీ థైస్‌ బాగున్నాయ్‌ అని వర్మ నిర్మొహమాటంగా కాంప్లిమెంట్‌ ఇవ్వడం ఆ తర్వాత అశు ఆయన చెంప చెల్లుమనిపించడం జరిగింది. ఆ తర్వాత వర్మ తనదైన స్టైల్‌లో మాట్లాడుకురావడం, వర్మతో కలిసి అశు కూడా మాటలు కలపడం ఇలా ఇంటర్వ్యూ మొత్తం సాగింది. 

మరిన్ని వార్తలు