‘ఊ అంటావా మావా... ఊ ఊ అంటావా మావా’అషురెడ్డి అదరహో!

28 Dec, 2021 17:20 IST|Sakshi

బిగ్‌బాస్ షో తర్వాత సోషల్ మీడియా స్టార్‌ అషు రెడ్డి జీవితమే మారింది. అప్పటి వరకు సోషల్‌ మీడియాలో వీడియోల ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న అషు.. బిగ్‌బాస్‌ తర్వాత వరుస సినిమా ఆఫర్లతో దూసుకెళ్తుంది. అలాగే ఈ మధ్యే సంచనల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మని బోల్డ్‌ ఇంటర్య్వూ చేసి సోషల్‌ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది.  జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ బోల్డ్‌ బ్యూటీ.. తాజాగా సమంత చేసిన తొలి స్పెషల్‌ సాంగ్‌కి తనదైన శైలీలో స్టెప్పులేసి అలరించింది.

పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మావా’పాట ఎంత పాపులర్‌ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఏ పంక్షన్‌లో చూసిదే ఇదే పాట మారుమోగుతుంది. సోషల్‌ మీడియాలో అయితే ట్రెండింగ్‌గా మారింది. ఇదే పాటకు  అషురెడ్డి చిందులేసింది. యూట్యూబ్ లో షేర్ చేసిన ఈ పాట టీజర్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. సమంతను మించిన బోల్డ్ అప్పీల్ తో అషు చేసిన ఈ పాట ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు