ప్లీజ్‌.. ఆ వీడియోలు తొలగించండి: బిగ్ బాస్‌ విన్నర్‌

24 Jul, 2021 13:50 IST|Sakshi

రియాలిటీ షో సెలబ్రిటీ, హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 2 విన్నర్‌ అశుతోష్‌ కౌశిక్‌ గురువారం ‘‘రైట్‌ టూ ఫర్‌గాటెన్‌’’ యాక్ట్‌ కింద ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన జీవితంపై హానీకరమైన ప్రభావం చూపుతున్న పలు వీడియోలు కొన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాయని వాటిని తొలగించాల్సిందిగా ​కేంద్రం, గూగుల్‌కు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా అశుతోష్‌ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించాడు.

ఈ క్రమంలో పిటిషన్‌దారు ‘‘గోప్యత హక్కు, మరచిపోయే హక్కును కోరుతున్నారని’’ దీనిపై స్పందించాలని జస్టిస్ రేఖ పల్లి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, గూగుల్ ఎల్ఎల్‌సీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్లను కోరారు. 2009 లో మద్యం తాగి వాహనం నడుపడం, కొట్లాటకు దిగిన ఫోటోలు, వీడియోలు, కథనాలను అదుపులోకి తీసుకున్నారు.

అశుతోష్‌ ఎంటీవీలో 2007లో ప్రసారం అయిన హీరో హోండా రోడీస్‌ 5.0 పాల్గొన్నారు. ఆ తరువాత హిందీ బిగ్‌ బాస్‌ సీజన్‌ 2(2008)లో పాల్గొని.. విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా అశుతోష్‌ మాట్లాడుతూ.. ‘‘గతంలో నా జీవితంలో నేను ఓ తప్పు చేశాను. దానికి మూల్యం చెల్లించాను.. శిక్ష అనుభవించాను. కానీ వ్యక్తిగతంగా ఆ తప్పు ఇప్పటికి నన్ను వెంటాడుతుంది. నాకు సంబంధిచిన ఈ పాత వీడియోలను ఇప్పుడు ఎవరైనా చూస్తే.. నేను ఇంకా అలాంటి పనులే చేస్తున్నానని పొరబడతారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 

‘‘ఈ వీడియోలను మా అమ్మ చూస్తూ నన్ను తప్పుగా అనుకుంటుంది. ‘‘అశు ఏంటిదంతా’’ అని ప్రశ్నిస్తుంది. నా తప్పుకు నా కుటుంబం బాధపడటం నాకు ఇష్టం లేదు. అందుకే వాటిని తొలగించాల్సిందిగా కోరాను. ఇప్పటికే చాలా సార్లు సదరు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ వారిని నాకు సంబంధించిన ఆ పాత వీడియోలను తొలగించాల్సిందిగా కోరాను. కొందరు నా బాధ అర్థం చేసుకుని ఆ వీడియోలను తొలగించారు. కొందరు అంగీకరించలేదు. ఇప్పటికే శిక్ష అనుభవించిన తప్పుకు మళ్లీ మళ్లీ శిక్ష అనుభవించడం సరైందేనా. అందుకే కోర్టు ద్వారా వెళ్లాలని నిర్ణయించుకుని.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాను’ అని తెలిపారు.  

మరిన్ని వార్తలు