అశ్విన్‌బాబు కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్‌

1 Aug, 2021 18:31 IST|Sakshi

యాంకర్‌ ఓంకార్‌ తమ్ముడు, ‘జీనియస్‌’ఫేమ్‌ అశ్విన్‌బాబు హీరోగా, అనిల్‌ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అశ్విన్‌ పుట్టిన రోజు పురస్కరించుకొని ఆదివారం ఆ సినిమా టైటిల్‌తో పాటు, ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘హిడింబ’ అనే విభిన్న పేరుని ఖరారు చేశారు. 

త‌ల‌పై ర‌క్త‌పు చుక్క‌లు.. చేతిలో ఇనుప చువ్వ‌ను ప‌ట్టుకుని సీరియస్‌లో లుక్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకున్నాడు అశ్విన్‌.  బట్టి చూస్తుంటే ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఈ చిత్రంలో అశ్విన్‌ సరసన నందితా శ్వేత నటిస్తోంది. రఘుకుంచె, రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ విఘ్నేశ్‌ కార్తీక్‌ సినిమాస్‌ పతాకంపై గంగాపట్నం శ్రీధర్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వికాస్‌ సంగీతం అందిస్తున్నాడు.

మరిన్ని వార్తలు