మత్తుమందు కలిపి నాతో తాగించారు : హీరోయిన్‌

26 Jan, 2021 06:20 IST|Sakshi
ఏషియా ఆజెంటో, రాబ్‌ కొహెన్‌

ఏషియా ఫ్యూరియస్‌

‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ చిత్రాల ఫేమ్‌ రాబ్‌ కొహెన్‌ తనని లైంగికంగా వేధించాడని ఆరోపించారు ప్రముఖ హాలీవుడ్‌ నటి ఏషియా ఆజెంటో. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టారామె. దర్శకుడు రాబ్‌ కొహెన్‌పై ఫ్యూరియస్‌ (ఆగ్రహం) అయ్యారు. 2002లో వచ్చిన ‘ట్రిపుల్‌ ఎక్స్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటించారు ఏషియా. ఈ సినిమాకు రాబ్‌ కొహెన్‌ దర్శకుడు. ‘ఈ సినిమా చిత్రీకరణలో నన్ను ఇబ్బంది పెట్టాడు.

నాకు తెలియకుండా నా డ్రింక్‌లో మత్తుమందు కలిపి నాతో తాగించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ మరుసటిరోజు రాబ్‌ కొహెన్‌ బెడ్‌రూమ్‌లో నగ్నంగా ఉన్నాను. ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నా ఆటోబయోగ్రఫీలో పొందుపరిచాను’’ అని ఆ ఇంటర్వ్యూలో ఏషియా ఆజెంటో పేర్కొన్నారు. ‘అనాటమీ ఆఫ్‌ ఏ వైల్డ్‌ హార్ట్‌’ అనే టైటిల్‌తో ఆమె ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు. ఈ పుస్తకం ఈ వారంలో విడుదల కానుంది. ఈ ఆరోపణల గురించి రాబ్‌ కొహెన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ– ‘‘ఇవన్నీ అవాస్తవం. రాబ్‌ ఎప్పుడూ తనని స్నేహితురాలిలానే చూశాడు. ప్రొఫెషనల్‌గా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది’’ అని పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు