ఛాన్స్‌ల పేరుతో నీలి చిత్రాలకు ఒత్తిడి.. సెట్స్‌లోనే నాన్సీ భాబీకి సంకెళ్లు

1 Aug, 2021 11:19 IST|Sakshi

హిందీ సినిమా ఫైనాన్షియర్‌, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ వ్యవహారం వార్తల్లో కొనసాగుతుండగానే.. మరో పోర్న్‌ రాకెట్‌ వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో గుట్టుచప్పుడు కాకుండా అశ్లీల చిత్రాల వ్యవహారం నడిపిస్తు‍న్న ఓ మోడల్‌ కమ్‌ నటిని పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరకబట్టి.. అరెస్ట్‌ చేశారు పోలీసులు. 

వర్ధమాన నటి నందితా దత్తా(30) ఒకప్పుడు బిజీ మోడల్‌. చాలాకాలంగా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఛాన్స్‌లు దొరక్క బీ గ్రేడ్‌, చివరికి సెమీ పోర్నోగ్రఫిక్‌ కంటెంట్‌ సినిమాల్లో నాన్సీ భాబీ పేరిట నటిస్తూ వస్తోంది. అయితే తనకున్న పరిచయాలతో యంగ్‌ మోడల్స్‌కు వెబ్‌ సిరీస్‌ అవకాశాలను ఎరగా చూపెట్టింది. చివరికి వాళ్లు వలలో చిక్కాక.. నీలి చిత్రాల్లో నటించాలని ఒత్తిడి చేస్తూ వస్తోంది. ఈ మేరకు ఇద్దరు బాధితురాళ్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు డమ్‌ డమ్‌, నక్‌టాలాలోని కొన్ని ఇళ్లలో శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపారు.

నక్‌టాలాలో తన ఇంట్లో ఓ మోడల్‌ నగ్నంగా మారాలని బెదిరిస్తున్న టైంలో పోలీసులు నందితాను అడ్డుకుని.. అరెస్ట్‌ చేశారు. మరోవైపు డమ్‌ డమ్‌లోని మరో ఇంట్లో ఆమె అనుచరుడు మైనక్‌ నేతృత్వంలో పోర్న్‌ షూటింగ్‌ జరుపుతున్న టైంలో పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.  అవకాశాల ఆశజూపి తమను ఇందులోకి దింపిందని.. మాట వినకుంటే తన మనుషులతో చంపిస్తానని బెదిరించిందని నందితపై ఆ ఇద్దరు మోడల్స్‌ ఆరోపణలు చేస్తున్నారు.

అంతేకాదు బాలీగుంజేలోని ఓ ప్రైవేట్‌ స్టూడియోలో తనపై అఘాయిత్యం జరిగిందని పేర్కొంటూ ఈ మేరకు జులై 26న న్యూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. ఇక ఈ కేసులో నందితతో పాటు మైనక్‌ ఘోష్‌ కీలక వ్యక్తులుగా భావిస్తున్నారు. ఇది భారీ సెక్స్‌ రాకెట్‌ అనే అనుమానం ఉందని, రాజ్‌కుంద్రాతో లింక్‌లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేపడతామని ఓ సీనియర్‌ అధికారి చెప్తున్నాడు. అయితే నందితను పూర్తిస్థాయిలో ప్రశ్నించాకే ఏ విషయం అనేదానిపై స్పష్టత వస్తుందని ఆయన అంటున్నాడు.

మరిన్ని వార్తలు