అదృశ్య శక్తితో చేసే పోరాటం..

12 Oct, 2021 10:03 IST|Sakshi

శ్రీరామ్, సంచితా పదుకొనే జంటగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఎన్వీఆర్‌ దర్శకత్వం వహించారు. మైనేని నీలిమా చౌదరి, కింగ్‌ జాన్సన్‌ కొయ్యడ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలకానుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఓ అదృశ్య శక్తితో చేసే పోరాటమే ఈ సినిమా. కొత్త తరహా కథాంశంతో రూపొందిన మా చిత్రం ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తుంది’’ అన్నారు. 

మరిన్ని వార్తలు