Kishor Das: 30 ఏళ్లకే ప్రముఖ నటుడు కన్నుమూత.. మంత్రి, సెలబ్రిటీల నివాళి

3 Jul, 2022 19:40 IST|Sakshi

Assamese Actor Kishor Das Dies At Age 30 After Battle With Cancer: సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అస్సామీ నటుడు కిశోర్‌ దాస్‌ శనివారం (జులై 2) కన్నుమూశారు. 30 ఏళ్ల కిశోర్‌ దాస్‌ కేన్సర్‌తో పోరాడి తుదిశ్వాస విడిచాడు. ఈ ఏడాది మార్చి నుంచి చెన్నై ఆస్పత్రిలో కేన్సర్‌ చికిత్స పొందుతున్న కిశోర్‌ దాస్‌కు కరోనా సోకినట్లు వైద్య నివేదికలో వెల్లడైంది. కేన్సర్‌తో పోరాడుతున్న అతనికి కరోనా సోకడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కిశోర్ దాస్‌ అంత్యక్రియలను చెన్నైలోనే నిర్వహించనున్నారు. కొవిడ్‌-19 ప్రొటోకాల్‌ కారణంగా అతని మృతదేహాన్ని అస్సాంలోని కామ్‌రూప్‌లో ఉన్న స్వస్థలానికి పంపించట్లేదు. 

అస్సామీ వినోద పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో కిశోర్ దాస్ ఒకరు. బంధున్, బిధాత, నేదేఖ ఫాగున్‌ వంటి తదితర అనేక పాపులర్‌ టీవీ సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. సీరియల్స్‌లోనే కాకుండా 300కుపైగా మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో నటించి సంగీత ప్రియులకు అభిమాన నటుడిగా మారాడు. 'తురుట్‌ తురుట్'‍ సాంగ్‌తో ఓవర్‌నైట్‌ స్టార్‌గా ఎదిగాడు. కిశోర్‌ చివరిసారిగా జూన్‌ 24న విడుదలైన 'దాదా తుమీ డస్తో బోర్‌' చిత్రంలో నటించాడు. కిశోర్‌ దాస్‌ 2019లో క్యాండిడ్‌ యంగ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును కూడా పొందాడు. 

చదవండి: బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్‌ వైరల్‌
వేశ్య పాత్రలో యాంకర్‌ అనసూయ..!

కిశోర్ మృతితో అస్సామీ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ‍్రాంతికి లోనైంది.  కిశోర్‌ అకాల మరణంపై అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి కేశబ్‌ మహంత ట్విటర్‌ ద్వారా సంతాపం తెలిపారు. అలాగే అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా 'తీరని లోటు' అంటూ నివాళులు అర్పిస్తున్నారు. 

చదవండి: అందుకు నాకు అర్హత లేదు: మహేశ్‌ బాబు


 

మరిన్ని వార్తలు