పూనమ్‌ భర్తకు బెయిల్‌ మంజూరు

23 Sep, 2020 16:11 IST|Sakshi

పనాజీ: పూనమ్‌ పాండే భర్త సామ్‌ బాంబేకు కోర్టు మంగళవారం సాయంత్రం బెయిల్‌ మంజూరు చేసింది. రూ.20 వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేసిన గోవా కోర్టు.. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. కాగా, వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచే పూనమ్‌ పాండే  ప్రేమించి పెళ్లి చేసుకున్న మూన్నాళ్లకే పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కారు. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, చంపుతానంటూ బెదిరింపులకు దిగాడని భర్త సామ్‌ బాంబేపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని సోమవారం సాయత్రం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దక్షిణ గోవాలోని కానకోన గ్రామంలో పూనమ్‌ ఓ సినిమా షూటింగ్‌కు వెళ్లిన క్రమంలో వేధించాడని, లైంగికంగా దాడికి చేశాడని పూనమ్‌ తన పిర్యాదులో పేర్కొంది.
(చదవండి: ఏడడుగులు వేసిన వేళ)

కాగా, కొంతకాలంగా ప్రేమిస్తున్న తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను ఈ నెల 1న పూనమ్‌ పాండే పెళ్లి చేసుకున్నారు. మోడల్‌ నుంచి నటిగా ఎదిగిన పూనం ఈనెల 10న తన పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ బాంబే అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్‌ ఇచ్చిన పూనం ఇంతలోనే భర్తపై ఫిర్యాదు చేయడం, సామ్‌ బాంబేను పోలీసులు అరెస్ట్‌ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన పూనమ్‌  2013లో నాషాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. దీని కారణంగానే సోషల్ మీడియాలో ఇమేజ్ సంపాదించారు. 
(చదవండి: బ‌న్నీని క‌లిసేందుకు అభిమాని పాద‌యాత్ర‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా